Trinethram News : సూర్యాపేట:మార్చి 07
మహిళా సాధికారతతోనే దేశ పురోభివృద్ధి సాధిస్తోం దని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు అభిప్రాయ పడ్డారు.
గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బిఎస్ లత తో కలిసి హాజరయ్యారు.
అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మహిళలందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి ప్రసంగించారు. సమాజ సేవలో మహిళలు ముందు ఉండటంతో పాటు ఓర్పు, సహనంతో తమ కుటుంబాలను తీర్చిదిద్దు తారని కితాబిచ్చారు.
మహిళలలు అభివృద్ధి చెందితేనే దేశం పురోగతిలో ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ జిల్లాలో అదనపు కలెక్టర్లు ఇద్దరు కూడా మహిళలు కావటం చాలా అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.
వారి సహకారంతో జిల్లాను అభివృద్ధిలో ముందంజలో ఉంచుతామని, అర్హులైన వారు చివరి వరుసలో ఉన్న వారికి పథకాలు అందేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు.
ఈ జిల్లాలో ఉన్న మహిళలు గ్రూపులుగా ఏర్పడి, బ్యాంకుల ద్వారా లోన్లు తీసుకొని నాణ్యమైన వస్తువులను ఉత్పత్తి చేస్తూ మన జిల్లాలోనే కాదు వేరే జిల్లాలకు కూడా ఎగుమతి చేయడం శుభపరిణామం అని తెలిపారు. పీఎంఎఫ్ ఎంఈ లో మన జిల్లాను మొదటి ర్యాంక్‌లో ఉంచిన్నందుకు మహిళలందరికి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు మహి ళలు గురించి పాడిన పాటలు బాగున్నాయని వారిని జిల్లా కలెక్టర్ అభినందించారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బిఎస్ లత మాట్లాడుతూ మహిళలపై ఎవరు వివక్షత చూపరా దని, మన పిల్లలని తప్పట డుగులు వేయకుండా మహిళల పట్ల గౌరవంగా ఉండేలా పెంచాలని, కుటుంబ బంధాలను బాధ్యతగా సక్రమంగా నిర్వహించాలని తెలిపారు.