TRINETHRAM NEWS

అధికారుల పై దాడి చేసిన దోషులను కఠినంగా శిక్షించాలి

,-టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు గజ్జల రామ్ కిషన్

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

వికారాబాద్ జిల్లాలో బొమ్మరసిపేట్ మండలము లాగ్ చెర్ల గ్రామాల్లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామసభ కార్యక్రమంలో ఫార్మా విలేజ్ కి సంబంధించిన ల్యాండ్ విషయంలో అక్కడి ప్రజలు జిల్లా కలెక్టర్ గారిపై మరియు ఇతర అధికారులకు పై చేసిన దాడికి నిరసనగా వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాన్ని టీఎన్జీవోస్ వరంగల్ జిల్లా పక్షాన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు గజ్జల రామ్ కిషన్ పాల్గొని మాట్లాడుతూ నిన్న జరిగిన అధికారుల పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం ఏది ఆదేశిస్తే దానికి అనుగుణంగా పనిచేయడం ప్రభుత్వ ఉద్యోగుల పని అని ప్రభుత్వ పథకాలను ప్రజలలో తీసుకెళ్తున్న బాధ్యత కూడా ప్రభుత్వ ఉద్యోగులదనని అటువంటి వారిపై దాడి చేయడం సరి అయినది కాదు అని,నిరసనలు తెలియజేయాలనుకుంటే చాలా మార్గాలు ఉన్నాయని కేవలం దాడి అనేది నిరసన కాదు అని దాడి చేయడం ద్వారా భయాందోళనకు గురి చేయడం అని అన్నారు. స్వయంగా జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేక సెక్యూరిటీ ,పోలీసు సిబ్బంది వున్న ఒక జిల్లా కలెక్టర్ పై ఈ విధంగా జరుగుతే ఒక సాధారణ ఉద్యోగి పరిస్థితి ఎలావుంటుందో ఒక్కసారి ఊహించుకుంటేనే ఉద్యోగాలు చేయాలంటేనే భయమేస్తుంది విధినిర్వహణలో రాత్రనక పగలనక ప్రభుత్వ ఆదేశాలకు అనుసారంగా పనిచేస్తున్న ఉద్యోగులు పరిస్థితి దారుణంగా ఉంది.అదే విధంగా ప్రత్యేకించి మహిళా ఉద్యోగులు పరిస్థితి మరి దారుణంగా వుంది ఈలాంటి దాడులను టీఎన్జీవో వరంగల్ జిల్లా తీవ్రంగా ఖండిస్తుంది ప్రభుత్వ ఉద్యోగులు అంటేనే ప్రభుత్వం ఏ పని చెప్తే ఆ పని చేయాలి అంతే తప్ప మేం ప్రజలకు గాని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయటం లేదు అలాంటి మా మీద దాడులు చేయడం హేయమైన చర్య కలెక్టర్ కె రక్షణ లేనప్పుడు సామాన్యంగా ఉద్యోగుల పరిస్థితి ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈలాంటి దాడులకు పాల్పడ్డ వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని టియన్జిఓస్ వరంగల్ జిల్లా పక్షాన కోరుచున్నాం ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వేణుగోపాల్, కోశాధికారి పాలకుర్తి సదానందం, జిల్లా ఉపాధ్యక్షులు గద్దల రాజు, దుర్గారావు ఇంద్రసేనారెడ్డి, సహాయ కార్యదర్శి లు రామకృష్ణ, రాజేశ్వరి ,మధుచంద్ర నూతన ప్రసాద్ ,నాలుగో తరగతి ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సాంబయ్య, భాను ప్రకాష్ జిల్లా ప్రచార కార్యదర్శి శంకేసి రాజేష్, ,నాయకులు నిరంజన్ రెడ్డి, భరత్, శ్రీనివాస్ ,పూర్ణ ,రమేష్ సారంగం ,నాగేశ్వరరావు, వెంకన్న ,తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App