TRINETHRAM NEWS

ఉమ్మడిగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన విద్యుత్తు చార్జీల, బిల్లులను గ్రామస్తులతో కలసి ధగ్ధం చేసిన(సిపిఎం) పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కిండింగి రామారావు.

అల్లూరి సీతారామరాజు జిల్లా (అరకు వేలి) మండలం త్రినేత్రం న్యూస్ డిసెంబర్. 13 :
రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మిలాకత్ అయ్యి ప్రజలపై భారం మోపిన విద్యుత్ ఛార్జీల ను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కె బెడ్డ గుడ లో విద్యుత్ బిల్లులను ధగ్ధం చేయడం జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాకముందు విద్యుత్ చార్యులు పెంచబోమని ఎన్నికల ప్రచారంలో ప్రజలను పచ్చి అబద్ధాల మాటలతో ఓట్లు దండుకొని అధికారం చేపట్టిన తర్వాత పేద ప్రజల పైన 17 వేల కోట్ల రూపాయలు భారం మోపడాన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండించారు, ట్రూ అప్ చార్జీలు సర్దుబాటు ఇతర చార్జీల పేర్లతో అదానికి కొమ్ముకాస్తూ పేద ప్రజలపై భారం మోపి అదానికి లాభం చేకూర్చే విధంగా అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసి పేదలకు మోసం చేస్తున్నది అని తెలిపారు. విద్యుత్ కొనుగోలు విషయంలో గత రాష్ట్ర ప్రభుత్వం లంచాలు పుచ్చుకొని రాష్ట్ర ప్రజలపై భారం మోపితే వాటన్నిటిని వ్యతిరేకించకుండా స్మార్ట్ మీటర్లు పెట్టి అధిక చార్జీలు మోపువడం సరైనది కాదన్నారు, రామారావు మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో కె. అర్జున్ ఎస్. పండు జి. భీమన్న ఎస్. రాజు కే. పోతన్న కే. బుచ్చన్న కె. అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App