The Congress Party has failed on the foundations of false propaganda with false words: MLA K.P.Vivekanand
Trinethram News : ఈరోజు గండిమైసమ్మ చౌరస్తా లోని భౌరంపేట్ సహకార సంఘం బ్యాంక్ ముందు రైతు రుణమాఫీ పై ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ భౌరంపేట్, దుందిగల్ కి చెందిన రైతులు తమ నిరసన తెలిపారు.
ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ మాట్లాడుతూ ఎన్నికల అనంతరం డిసెంబర్ 9 లోపు అందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షలరుణమాఫి చేశామని చెబుతూ రైతాంగాన్ని నట్టేటా ముంచిందని ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ఎద్దేవా చేశారు. బౌరంపేట్,దుండిగల్
ఈ బ్యాంక్ లో 632మంది రైతులు రుణం పొందితే కేవలం 14మంది రైతులకు 4.30లక్షలు మాత్రమే బుణమాఫీ అయ్యిందని మిగతా 618మంది రైతులకు 2.95కోట్ల రుణాలను మాఫీచేయాలని లేని యేడల మోసపూరిత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేషరతుగా రైతులకు క్షమాపణ చెప్పి గద్దెదిగాలని ఎమ్మెల్యే అన్నారు.
రైతుభరోసా రాష్ట్ర వ్యాప్తంగా పత్తాకులేదన్నారు. రుణమాపి డిసెంబర్ 9 నుండి ఆగస్ట్ 15లోగా తెలంగాణ రైతులందరికి రెండు లక్షల రుణమాపి చేస్తానని మాయమాటలు చెప్పిన రేవంత్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబందించి
నియోజకవర్గ వ్యాప్తంగా కేవలం ఐదు శాతం మంది రైతులకు మాత్రమే రుణమాపి చేసిందన్నారు.
ఈ కార్యక్రమంలో భౌరంపేట్ పాక్స్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, వైస్ చైర్మన్ వెంకటేష్, డైరెక్టర్లు భీమ్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, జీతయ్య, కృష్ణ, సత్తిరెడ్డి, ఈ. శ్రీనివాస్, రైతులు పీసరి నర్సిరెడ్డి, భరత్ రెడ్డి, బద్ధం శంకరయ్య, పీసరి కరుణాకర్ రెడ్డి, ఆకుల ఈశ్వరయ్య, నాచారం మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App