పరకాల : తేదీ: 08.10.2024
పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాటమయ్య రక్షా కిట్స్ పంపిణీ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తో కలిసి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా పరకాల నియోజకవర్గ పరిధిలోని 85మంది శిక్షణ పొందిన కల్లు గీతా కార్మికులకు కాటమయ్య రక్షా కిట్స్ ను పంపిణీ చేశారు.
అనంతరం ఎంపీ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కుల వృత్తులను బలోపేతానికి కృషి చేయడంతో పాటు వారి సంక్షేమానికి, భద్రతకు భరోసా ఇస్తుందని అన్నారు. అత్యంత ప్రమాదకర వృత్తి కల్లు గీతా వృత్తి అని, ప్రాణాలను ఫనంగా పెట్టి కల్లు తీయడం గొప్ప విషయమని అన్నారు. ఎన్నో ఔషదగుణాలు ఉన్న కల్లు ఆరోగ్యానికి మేలు చేస్తుందని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ రక్షా కవచాలను ప్రతీ కల్లు గీతా కార్మికుడు కచ్చితంగా ఉపయోగించాలని సూచించారు. గీతా కార్మికుల భద్రత కోసం దేశ అత్యున్నత పరిశోధన కేంద్రంలో పరీక్షించిన తరువాతే ఈ రక్షా కిట్స్ ను అందజేయడం జరుగుతుందని తెలిపారు. కల్లు గీతా కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డివో నారాయణ, బిసి వెల్ఫెర్ డిడి రాం రెడ్డి, పరకాల మున్సిపల్ చైర్మన్ అనిత రామకృష్ణ, ఎక్సైజ్ సూపరండెంట్ మురళీధర్, గౌడ సంఘం అధ్యక్షులు బోనగాని యాదగిరి గౌడ్, కల్లు గీతా సంఘం అధ్యక్షులు గౌని సాంబయ్య గౌడ్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, కల్లు గీతా కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App