TRINETHRAM NEWS

The compulsory medical tests in Singareni should be stopped immediately

జిఎం లలిత్ కుమార్ వినతిపత్రం సమర్పించిన కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ
.
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రామగుండం 1 లోని జి ఎం కార్యాలయంలో జి ఎం లలిత్ కుమార్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆర్ జి వన్ లో కొనసాగిస్తున్న మెడికల్ టెస్ట్ల విధానాన్ని రద్దు చేయాలని, సింగరేణి కాంట్రాక్టు కార్మిక కుటుంబాలకు సింగరేణి ఆసుపత్రుల్లో వైద్య సదుపాయం కల్పించాలని కోరడం జరిగింది ఈ సందర్భంగా సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు కడారి సునీల్, తోకల రమేష్, మద్దెల శ్రీనివాస్ మాట్లాడుతూ
సింగరేణి సంస్థలో కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న మహిళా కార్మికులను మెడికల్ టెస్టుల పేరుతో సింగరేణి యాజమాన్యం వేధింపులకు చేస్తున్నది. మహిళా కార్మికులు చెప్పుకోలేని విధంగా సింగరేణి హాస్పిటల్ లో సింగరేణి యాజమాన్యం నిర్బంధంగా మెడికల్ టెస్ట్లను కొనసాగిస్తున్నది. మహిళా కార్మికులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా వేధింపులకు గురి చేసే విధంగా అత్యంత పాశవికంగా గర్భకోశ వ్యాధులకు సంబంధించి సైతం టెస్టులు చేస్తూ మహిళా కార్మికులను అవమానపరిచే విధంగా, భయభ్రాంతులకు గురి చేసే విధంగా టెస్టులను కొనసాగిస్తుంది.

ఈ విధానాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సింగల్ హ్యాండ్ సంస్థలో కొనసాగిస్తున్న ఈ నిర్బంధ టెస్టుల విధానాన్ని తక్షణమే నిలిపివేయాలని చైర్మన్ బలరాం విజ్ఞప్తి చేస్తున్నాం. వేతనాల పెంచాలని అనేక సంవత్సరాలుగా చేస్తున్న పోరాటాన్ని లెక్కచేయకుండా వేతనాలు పెంచకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సింగరేణి యాజమాన్యం మెడికల్ టెస్ట్ లలో మాత్రం పోటీపడుతూ కార్మికులను వేధింపులకు గురి చేస్తున్నది. హౌస్ కీపింగ్ పని వాళ్లకు మెడికల్ టెస్ట్లతో పనిలేదు.

కేవలం అండర్ గ్రౌండ్ మైన్స్ లలో దిగేవారికి ఇలాంటి టెస్టుల అవసరం ఉంటుంది. కానీ చాలీచాలని జీతాలతో, ఎంతో అవస్థలకు ఓర్చుకొని తమ కుటుంబాలను నెట్టుకు వస్తున్న మహిళా కాంట్రాక్టు కార్మికులను ఈ విధంగా వింత వింత టెస్టులతో వారిని ఇబ్బంది పెడుతూ మానసిక వేదనకు గురిచేస్తుంది. వెంటనే ఇటువంటి టెస్టుల విధానాన్ని రద్దు చేయాలని చాతనైతే వేతనాలు పెంచే విధంగా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The compulsory medical tests in Singareni should be stopped immediately