TRINETHRAM NEWS

న్యాయవాదుల దీక్షకు మద్దతు తెలిపిన భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ

ఆంధ్ర ప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య చట్టం 2022 ను వెంటనే రద్దు చేయాలి అని బాపట్ల న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా పట్టణంలో పాత బస్టాండ్ సెంటర్ వద్ద రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి.

భూమి హక్కుల యాజమాన్య చట్టం 2022 అనేది పూర్తి ప్రజా వ్యతిరేక చట్టం అని , రాబోయే భోగి మంటలలో ఈ చట్టాన్ని బూడిద చేయడానికి మేము సైతం మీతో అంటూ న్యాయవాదుల దీక్ష స్థలి వద్ద సిపిఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ, సిపిఐ సీనియర్ నాయకులు శ్రీధర్ మద్దతు ప్రకటించి సంఘీభావం తెలిపారు.

బాపట్ల జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భీమ లీలా కృష్ణ మాట్లాడుతూ సిపిఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ మద్దతు ప్రకటించటం మంచి పరిణామం అని హర్షం వ్యక్తం చేశారు.

నాలుగవ రోజు రిలే నిరాహార దీక్షలో న్యాయవాదులు గోవ తోటి నవీన్, చాపల ప్రవీణ్, దాసరి కృష్ణ కిషోర్,దుండి కనకా రెడ్డి,చిరంజీవి మార్కండేయులు తదిరులు పాల్గొన్నారు.