TRINETHRAM NEWS

The Chief Minister of the State held a video conference with the District Collectors on the progress of land acquisition for National Highways

జాతీయ రహదారుల నిర్మాణానికి గడువులోగా భూ సేకరణ పూర్తి చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

*జూలై నెలాఖరు నాటికి భూ సేకరణ ఆర్భిట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి

*జాతీయ రహదారుల భూ సేకరణ పురోగతిపై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి

పెద్దపల్లి, జూలై -10: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

జాతీయ రహదారుల నిర్మాణానికి గడువు లోగా భూ సేకరణ పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులతో కలిసి జాతీయ రహదారుల భూ సేకరణ పురోగతి పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కోయ హర్ష అదనపు కలెక్టర్ జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ లతో కలిసి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

రిజనల్ రింగ్ రోడ్డు ఎక్స్ ప్రెస్ వే ఉత్తర భాగం, మంచిర్యాల వరంగల్ ఖమ్మం విజయవాడ ఎన్.హెచ్ 163జి, ఆర్మూర్ జగిత్యాల మంచిర్యాల ఎన్.హెచ్ 63 నిర్మాణాలకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియ పురోగతిపై సంబంధిత జిల్లా కలెక్టర్ లు, ఇతర ఉన్నతాధికారులతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించి పలు సూచనలు చేశారు.

మంచిర్యాల వరంగల్ ఖమ్మం విజయవాడ ఎన్.హెచ్ 163జి జాతీయ రహదారి మన రాష్ట్రంలో దాదాపు 334 కిలోమీటర్ల మేర ఉంటుందని, దీనికి సంబంధించి 1383 హెక్టార్ల భూ సేకరణ చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 1284 హెక్టార్ల భూమికి అవార్డు పాస్ చేశామని, 415 హెక్టార్ల భూమి జాతీయ రహదారుల అథారిటీకి అప్పగించడం జరిగిందని అధికారులు వివరించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,ఎన్.హెచ్ 163జి పరిధిలో పెండింగ్ లో ఉన్న 99 హెక్టార్ల భూ సేకరణ ప్రక్రియ నెల రోజుల వ్యవధిలో పూర్తి చేయాలని అన్నారు. భూసేకరణ అవార్డు పాస్ చేసి భూ బదలాయింపు జరగని సంబంధిత రైతులు, భూ యాజమాన్యంతో చర్చించి ఆర్బిట్రేషన్ కు వచ్చేలా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారు.

ఆర్బిట్రేషన్ ప్రక్రియలో జాతీయ రహదారుల అధికారులను భాగస్వామ్యం చేయాలని, గత 6 నెలల కాలంలో సంబంధిత భూ సేకరణ ప్రాంతాల్లో జరిగిన అత్యధిక విలువ లావాదేవీల డాక్యూమెంట్ లు ఆర్బిట్రేషన్ ద్వారా జారీ చేసే అవార్డులతో జత చేయాలని, జూలై నెలాఖరు నాటికి ఆర్బిట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.

భూ సేకరణ ప్రక్రియలో కలెక్టర్ లు నేరుగా రైతులతో చర్చించాలని, వారికి జాతీయ రహదారుల అథారిటీ ద్వారా మెరుగైన పరిహరం అందించేందుకు కృషి చేస్తున్నామని భరోసా కల్పించాలని అన్నారు. జాతీయ రహదారులనిర్మాణంలో కోల్పోతున్న అటవీ శాఖ భూములకు ప్రత్యామ్నాయ భూములు గుర్తించి అఫారెస్టేషన్ ప్రారంభించాలని, అటవీ శాఖ ద్వారా అవసరమైన అనుమతులు త్వరగా సాధించేందుకు అధికారులుసమన్వయంతో పని చేయాలని అన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయ హర్ష మాట్లాడుతూ,మంచిర్యాల వరంగల్ గ్రీన్ ఫీల్డ్ 4 లైన్ల జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా పెద్దపల్లి జిల్లాలో 37 కిమి మేర రోడ్డు నిర్మాణం జరుగనుందని, దీనికి సంబంధించి 204.4 హెక్టార్ల భూ సేకరణ చేయాల్సి ఉండగా 196.3 హెక్టార్ల భూ సేకరణ అవార్డు పాస్ చేశామని, పరిహారంతో రైతులు సంతృప్తి చెందక భూములు అప్పగించడం లేదని, రైతులతో పలు మార్లు చర్చలు జరిపి ఆర్బిట్రెషన్ కు వచ్చెందుకు ఒప్పించామని అన్నారు.

జాతీయ రహదారుల అధికారులను భాగస్వామ్యం చేస్తూ, సరైన ఆధారాలతో ఆర్బిట్రేషన్ అవార్డు పాస్ చేస్తామని, జూలై నెలాఖరు నాటికి ఆర్భిట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి సవరించిన అవార్డులు జారీ చేస్తామని, ఆర్భిట్రేషన్ ప్రకారం పరిహారం విడుదల చేసిన 10 రోజులలో భూమి జాతీయ రహదారుల ఆథారిటి అప్పగిస్తామని కలెక్టర్ తెలిపారు. పెండింగ్ ఉన్న 8.1 హెక్టార్ల భూ సేకరణ నెల రోజుల వ్యవధిలో పూర్తి చేస్తామని అన్నారు.

ఈ సమావేశంలో మంథని రెవెన్యూ డివిజన్ అధికారి వి.హనుమా నాయక్, జిల్లా అటవీ శాఖ అధికారి శివయ్య, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The Chief Minister of the State held a video conference with the District Collectors on the progress of land acquisition for National Highways