Tet twice a year from now on
Trinethram News : Telangana : టెట్(టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్)ను ఇకపై ఏడాదికి రెండు సార్లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్‌లో ఒకసారి, డిసెంబర్లో రెండోసారి టెట్ నిర్వహించనున్నారు. ఈ మేరకు శనివారం విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. చిన్నారులకు ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ)–2009 కింద టెట్‌ను రెండు సార్లు నిర్వహించాలని నిర్ణయించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అందుకు అనుగుణంగా 2015 డిసెంబర్ 23న విడుదల చేసిన జీవో 36కు సవరణలు చేయాల్సిందిగా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, టెట్ చైర్పర్సన్, ఎస్ఈఆర్టీ డైరెక్టర్‌ను ఉత్తర్వుల్లో ఆదేశించారు. అభ్యర్థులు టెట్‌ను ఎన్నిసార్లయినా రాసుకోవచ్చని, అటెంప్ట్స్పై ఎలాంటి ఆంక్షల్లేవని పేర్కొన్నారు. టెట్‌లో క్వాలిఫై అయినా స్కోరును పెంచుకునేందుకు పరీక్షను మళ్లీ రాయవచ్చని ఉత్తర్వుల్లో తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
Tet twice a year from now on