TRINETHRAM NEWS

TET & DSC, Study Material distributed by Paderu Sub Collector

Trinethram News : అల్లూరిజిల్లా ( పాడేరు ) న్యూస్

విజయ “సాధన” తోనే డిఎస్సీ

ఆదివాసీ గిరిజన సంఘం కృషిని అభినందించిన సబ్ కలెక్టర్

టెట్ & డీఎస్సీ ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణి చేసిన పాడేరు సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్

విజయ సాధన తోనే డిఎస్సీ లో ఉపాద్యాయ పోస్టులు సాధ్యమని పాడేరు సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్ పిలుపు నిచ్చారు.

అల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లా కేంద్రంలో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ పోటీ పరీక్షల నిపుణులు శాసనమండలి సభ్యులు కే.ఎస్ లక్ష్మణరావు రూపోతుందించిన (విధ్యా మనోవిజ్ఞాన శాస్త్రం) టెట్ & *డీఎస్సీ ఉచిత మెటీరియల్ పంపిణీ కార్యక్రమం జిల్లా, అధ్యక్షులు ధర్మన్నపడాల్ అధ్యక్షతన నిర్వహించారు

డీఎస్సీ ఉచిత మెటీరియల్ పంపిణీ కార్యక్రమానికి, ముఖ్యఅతిథిగా పాడేరు రెవెన్యూ డివిజన్ సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్ పాల్గొని ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి.అప్పల నరస, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సురేంద్ర తో కలిసి ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణి చేశారు. అనంతరం సబ్ కలెక్టర్, మాట్లాడుతూ విజయ సాధన కు ఇష్టపడి చదివితే డిఎస్సీ లో ఉపాద్యాయ పోస్టులు సాధించవచ్చని అన్నారు. నేటి పోటీ ప్రపంచంలో నిరుద్యోగులు ప్రణాళిక ప్రకారం కృషి చేయాలని, టీచర్ పోస్టులు సాధానవే లక్ష్యం చేసికొని టెట్ & డిఎస్సీ పరీక్షలకు సన్నద్ధం కావడం అవసరం ఉందని అన్నారు. మానసిక, శారీరిక ఒత్తిడిని జయించే స్టడీ ప్రణాళిక రూపొందించాలని అన్నారు. ప్రతిభ ఎవరికీ సొంతం కాదని తెలిపారు.గెలుపు ఓటములు సహజమేనని అదే సందర్భంలో విజయ సాధన కోసం నిత్యం కృషి చేయడం మంచిది అని తెలిపారు.స్టడీ మెటీరియల్స్ పంపిణి చేస్తున్న ఆదివాసి గిరిజన సంఘం కృషిని అభినందించారు.

ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు పి అప్పలనర్స మాట్లాడుతూ పోటీ పరీక్ష పై అవగాహన చేసుకుంటే విజయం సాధించవచ్చని, జనరల్ డిఎస్సీ లో ఆదివాసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ,ఆదివాసీ ప్రత్యేక డిఎస్సీ సాధన కోసం ఉద్యమం చేయాల్ని యూత్ కి కోరారు. ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసి నిరుద్యోగులు వేలసంఖ్యలో ఉన్నారని జనరల్ డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఆదివాసులకు న్యాయం జరగదని ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.
జీవో నెంబర్ -3 చట్టబద్ధత కల్పిస్థమని రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, నేటికీ రాష్ట్ర కేబినెట్ 6 సార్లు సమావేశం ఏర్పాటు చేశారనీ కానీ జీవో నెంబర్ -3 చట్టబత, ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్, కోసం కనీసం చర్చించలేదని అన్నారు.

ఈ కార్యక్రమంలో *రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో వివిధ శాఖల్లో ఆదివాసీ యువతకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి, పి. బాల్ దేవ్,మరియు ఐదు వందల మంది ఆదివాసీ నిరుద్యోగులకు ఉచితంగా టెట్ & డిఎస్సీ పుస్తకాలు పంపిణి చేశారు. ఆదివాసీ మాతృ భాష విద్య వాలంటరీ సంఘం జిల్లా అధ్యక్షుడు మర్రి శ్రీను, ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి జీవన్, వరహాల బాబు ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు చిట్టిబాబు,సత్యనారాయణ, కృష్ణ రావు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App