Trinethram News : ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫీజులను వెంటనే తగ్గించాలని కోదాడ నియోజకవర్గ తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్(TPTF) అధ్యక్షులు రాంపల్లి రాంబాబు డిమాండ్ చేశారు. ఇంతకుముందు నిర్వహించిన టెట్ కు రెండు పేపర్లకు కలిపి 400 రూపాయలు ఫీజు ఉండగా, ఇప్పుడు పేపర్ కి వెయ్యి రూపాయల చొప్పున రెండు పేపర్లకు కలిపి రెండు వేల రూపాయల అధిక ఫీజును పెంచడం నిరుద్యోగుల పైన,వారి కుటుంబం పైన మోయలేని ఆర్థిక భారం పడుతుందని వారు తెలిపారు. నిరుద్యోగులు సొంత ఇంటికి దూరంగా ఉంటూ, పట్టణాలలో ప్రభుత్వ నౌకరి కోసం సన్నద్ధమవుతూ ,పెట్రోల్ బంకులలో, స్విగ్గి ,జొమాటో, రాపిడో,వంటి దొరికిన చిన్న చిన్న పనులను చేస్తూ ఒక పూట తిని, మరో పూట పస్తులు ఉంటూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. వెంటనే టెట్ దరఖాస్తు ఫీజులను తగ్గించి నిరుద్యోగులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
టెట్ దరఖాస్తు ఫీజులను వెంటనే తగ్గించాలి
Related Posts
జర్నలిస్ట్ లు ఆరోగ్యంపై శ్రద్ద చూపాలి : ఐఎంఏ ప్రెసిడెంట్ క్యాస శ్రీనివాస్
TRINETHRAM NEWS జర్నలిస్ట్ లు ఆరోగ్యంపై శ్రద్ద చూపాలి : ఐఎంఏ ప్రెసిడెంట్ క్యాస శ్రీనివాస్ గోదావరిఖని : త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని నిత్యంప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం కాలంతో పోటీపడుతూ ఒత్తిడిలో పనిచేసే జర్నలిస్ట్ లు తమ ఆరోగ్యంపై…
బిజెపి కార్యక్రమాలకి చిరంజీవికి ఆహ్వానం అందుకే..! సంచలన కామెంట్ చేసిన కిషన్ రెడ్డి
TRINETHRAM NEWS బిజెపి కార్యక్రమాలకి చిరంజీవికి ఆహ్వానం అందుకే..! సంచలన కామెంట్ చేసిన కిషన్ రెడ్డి Trinethram News : Telangana : మెగా స్టార్ చిరంజీవి వరుసగా సినిమాలను లైనప్ చేసి ఆ షూటింగ్స్ తో బిజీగా గడుపుతున్నారు. ఓ…