Trinethram News : జ్ఞానవాపిలో లభించిన శిలాశాసనంపై తెలుగువారి పేర్లు మల్లన్న భట్టు, నారాయణ భట్టుగా గుర్తించిన ఏఎస్‌ఐ డైరెక్టర్ ఉత్తరప్రదేశ్‌లోని వారాణసీ జిల్లాలో ఉన్న కాశీవిశ్వనాథుని ఆలయం సమీపంలోని జ్ఞానవాపి మసీదు ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో హిందూ దేవతల విగ్రహాలు బయల్పడిన విషయం తెలిసిందే. వీటితోపాటు తెలుగు లిపితో ఉన్న ఒక శిలా శాసనాన్ని కూడా భారత పురాతత్వ శాస్త్రవేత్తలు వెలికి తీశారు. తిరుపతికి చెందిన ఏఎస్‌ఐ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి ఆ శాసనంపై ఉన్న తెలుగు లిపిని డీకోడ్ చేశారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. శిలాశాసనంపై ‘మల్లన్న భట్టు, నారాయణ భట్టు’ పేర్లు ఉన్నాయి. నారాయణ భట్టు కుమారుడే మల్లన్న భట్టు. వీరు తెలుగు బ్రాహ్మణులు. 1585లో పునర్నిర్మించిన కాశీవిశ్వనాథుని ఆలయ నిర్మాణ పనులను పర్యవేక్షించారు. 15వ శతాబ్దంలో జౌన్‌పూర్ సుల్తాన్ హుస్సేన్ షార్కి(1458–1505) కాశీవిశ్వనాథుని మందిరాన్ని కూల్చేశారు. తర్వాత కాలంలో రాజ్యం చేపట్టిన రాజా తోడరమల్లు ఈ ఆలయాన్ని పునర్నిర్మించాలని నిర్ణయించారు. దక్షిణ భారత దేశానికి చెందిన నిపుణులైన నారాయణ భట్టును సంప్రదించి ఈ బాధ్యతలను ఆయనకు అప్పగించారని చరిత్ర
జ్ఞానవాపిలో లభించిన శిలాశాసనంపై తెలుగువారి పేర్లు
Related Posts
Encounter : సుక్మా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్
TRINETHRAM NEWS సుక్మా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ Trinethram News : చత్తీస్ ఘడ్ : నవంబర్ 22ఛత్తీస్‌ఘడ్‌లో రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తుంది,సుక్మా జిల్లా లోని దండకారణ్యంలో మావోయిస్టులు సమావేశ మయ్యారనే పక్కా సమాచారంతో కూంబింగ్ నిర్వహిస్తున్న…
PM Modi left for India : మూడు దేశాల పర్యటన ముగించుకుని భారతదేశానికి బయలుదేరిన ప్రధాని మోడీ
TRINETHRAM NEWS మూడు దేశాల పర్యటన ముగించుకుని భారతదేశానికి బయలుదేరిన ప్రధాని మోడీ ప్రధాని నరేంద్ర మోదీ గయానా పర్యటన ముగించుకుని స్వదేశానికి బయలుదేరారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన ఇండియా-కరేబియన్ కమ్యూనిటీ సమ్మిట్‌కు సహ అధ్యక్షుడిగా వ్యవహరించారు.. ద్వైపాక్షిక చర్చలు…