Telangana state was prepared due to the sacrifice of many nobles
పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు& రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు.
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలో జరిగిన ప్రజా పాలన దినోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కార్పొరేషన్ నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, కమిషనర్ శ్రీకాంత్, కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దొరల… గడీల పాలన నుంచి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని విమోచన చేశారన్నారు. అదేవిధంగా ఇక్కడున్న సింగరేణి ప్రాంతంలో ఉన్న ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజల పోరాటాలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. తదనంతరం ఎందరో మహానుభావుల, యువకుల బలిదానాలను అర్థం చేసుకున్న సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని అన్నారు. రజాకార్లు దొరల పాలన నుంచి నిన్నటిదాకా గడియల పాలనను అంతం చేసి కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన కొనసాగిస్తుందన్నారు. పదేళ్లపాటు తెలంగాణ ప్రాంతాన్ని లక్షల, కోట్లు దోచుకున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం గ్యారంటీ లతో పాటు సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో సఫలమయామని పేర్కొన్నారు. ప్రజా పాలనకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాంది పలికిందన్నారు. ఇదే క్రమంలో ఈ ప్రాంతంలో మరింతగా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App