Telangana State Government to Women’s Associations
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వసక్తి మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందించి మహిళలను కోటీశ్వరులు చేయాలని సంకల్పంతో 20 వేల కోట్ల రుణాలు అందించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇదంతా బాగానే ఉంది కానీ చాపకింది నీరు లాగా కొందరి మండల అధికారుల నిర్లక్ష్యంతో మహిళ సంఘాలు రుణాలు అందుకోలేక పోతున్నారని తెలుస్తుంది.
వివరాల్లోకి వెళితే పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలంలో రుణాలు పొందిన వారి నుండి నెలనెలా కట్టే కిస్తీలకంటే ఎక్కువ వసూలు చేసినట్టు అధికారులకు ఫిర్యాదులు అందిన పట్టించుకోకపోవటం ద్వారా ఇంకొందరు రుణాలు తీసుకునే అవకాశం ఉండి రుణాలు తీసుకోలేక పోతున్నట్లు తెలుపుతున్నారు. మండలంలో జరిగిన శ్రీనిధి రుణాలకు సంబంధించి ఇప్పటికే పలుమార్లు దినపత్రికలు వార్తలు రాయడం జరిగింది.
పూర్తి సమాచారం కోసం సంబంధించిన అధికారులను డీసీబి రిపోర్ట్ కోరగా పొంతన లేని సమాధానం చెప్పుతూ దాటవేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మండలంలో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోకపోతే ఆ అధికారుల తీరు మారదు అంటున్నారు. మండలంలో పనిచేస్తున్న ఏపిఏం పై గతంలో పని చేసిన మండలంలో పిర్యాదులు కూడా ఉన్నాయి. అధికారుల తీరు మారుతనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని అనుకుంటున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App