TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్ : ఫిబ్రవరి 19
తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష హాల్ టిక్కెట్లు నేడు విడుదల చేశారు. హాల్ టిక్కెట్లు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. మొదటి సంవత్సరం విద్యార్థులు ESSSC లేదా మొదటి సంవత్సరం హాల్ టికెట్ నంబర్‌తో థియరీ పరీక్ష హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

రెండవ సంవత్సరం వారు మొదటి సంవత్సరం లేదా రెండవ సంవత్సరం హాల్ టిక్కెట్ నంబర్‌తో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్ టిక్కెట్ల లో ఫోటోలు, సంతకాలు ఇతర సవరణలను కళా శాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లి వాటిని సరిదిద్దు కునే సౌకర్యం ఉంది.

ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ఫిబ్రవరి 28 నుండి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించన‌ న్నారు. ఆయా తేదీలలో ప్రతిరోజూ ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.

ఈ ఏడాది 9.8 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకాను న్నారు…