TRINETHRAM NEWS

Telangana High Court has given green signal to demolish Nalgonda district BRS office

Trinethram News : నల్గొండ జిల్లా : మున్సిపల్ శాఖ అనుమతులు తీసుకోకుండా బీఆర్ఎస్ కార్యాలయాన్ని
నిర్మించారని..

ఎలాంటి అనుమతుల్లేకుండా నిర్మించడంతో కూల్చేయాలని గతంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాలు ఇచ్చారు.

ఈ ఆదేశాల్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

తమ కార్యాలయాన్ని రెగ్యులరైజ్ చేసేలా మున్సిపల్ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ తన పిటిషన్లో పేర్కొంది. ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది.

ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక కామెంట్స్ చేసింది. కార్యాలయం కట్టడానికి ముందే అనుమతులు తీసుకోవాలి కదా? అని హైకోర్టు ప్రశ్నించింది. కట్టిన తర్వాత అనుమతులు కోరడం ఏంటని నిలదీసింది. బీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణం ముమ్మాటికీ చట్టం ఉల్లంఘించడమే అని కోర్టు పేర్కొంది.
15 రోజుల్లో బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో బీఆర్ఎస్ నేతలు షాక్కుగురయ్యారు. సుప్రీంకోర్టుకు వెళ్తారా? లేక ఇంతటితో ఊరుకుంటారా? అనేది చర్చనీయాంశమైంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Telangana High Court has given green signal to demolish Nalgonda district BRS office