Telangana farmers have been cheated by Revant Sarkar
కేసీఆర్ పాలనలో రైతు ముఖంలో అనందం కాంగ్రెస్ పాలనలో కన్నీళ్లు
వంద శాతం రుణమాఫీ జరిగేదాకా వదిలేది లేదు
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్
ఎన్నికల్లో తెలంగాణ రైతంగానికి వంద శాతం 2 లక్షల రుణమాఫీ చేస్తాన ని హామి ఇచ్చిన రెవంత్ రెడ్డి సర్కార్ 40 శాతం మంది మాత్రమే రుణమాఫి చేసి రైతంగాన్ని దగా మెాసం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామిని నేరవేర్చేదాకా వదిలేదిలేదని రామగుండం మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పిలుపు మేరకు ఎలాంటి అంక్షాలు లేకుండా రైతులకు 2 లక్షల రుణమాఫీ కోసం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ రైతు ధర్నా కార్యక్రమాన్ని మాజీ శాసనసభ్యులు జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షుడు కోరుకంటి చందర్ చెపట్టారు.
ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసారు అనంతరం అయన మాట్లాడుతూ ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు 40 శాతం మాత్రమే రుణమాఫీ చేసి రైతులను మెాసం చేస్తుందన్నారు. ఎన్నికల సమయంలో ఒక మాట ఎన్నికలు అయ్యాకా మరో మాట ఓడ దాటే వరకు ఓడ మల్లన్న ఓడ దాటినా తర్వాత బోడ మల్లన్న అన్న చందంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. తొలి సిఎం కేసీఆర్ పాలనలో రైతుల ముఖాల్లో అనందం నిండితే రెవంత్ రెడ్డి ప్రభుత్వం లో రైతులకు కన్నీరు మిగిలిందన్నారు.
కేసీఆర్ పాలనంతా రైతు సంక్షేమం అభివృద్ధి సాగిందన్నారు. తెలంగాణ ప్రాంత రైతులందరు సిఎం రెవంత్ రెడ్డి పై కన్నెర్ర చేసారని రుణమాఫీలో ఇంకా జ్యాపం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి నాయకులకు తగిన బుద్ది చెప్పేందుకు రైతులు సిద్దంగా ఉన్నారని ఆయన హెచ్చరించారు. రైతుల పక్షాన పోరాటం చేయాడానికి తొలి సిఎం కేసీఆర్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోట్లాడుతున్నరని రైతు రుణమాఫీ అమలు అయ్యేదాక బిఆర్ఎస్ పార్టీ పోరాడుతుందన్నారు.
ఈ కార్యక్రమం లో మాజీ జడ్పటీసీ ఆముల నారాయణ బాదె అంజలి గాధం విజయ కల్వచర్ల కృష్ణ వేణీ నాయకులు జె.వి రాజు నారాయణదాసు మారుతి రాకం వేణు మేడి సదయ్య చల్లగురుగుల మెగిళి పిల్లి రమేష్ బోడ్డుపల్లి శ్రీనివాస్ నూతి తిరుపతి అల్లం రాజన్న ధరని రాజేష్ చెలకలపల్లి శ్రీనివాస్ బోడ్డు రవీందర్ అచ్చే వేణు ఆడప శ్రీనివాస్ మేతుకు దేవరాజ్ నీరటీ శ్రీనివాస్ జిట్టవేనీ ప్రశాంత్ కుమార్ చింటూ ఇరుగురాళ్ల శ్రావన్ ముద్దసాని సంధ్యా రెడ్డి తోకల రమేష్ సట్ఠు శ్రీనివాస్ కొల సంతోెష్ కిరణ్ జీ పాలడుగుల కనకరాజ్ ఆవునూరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App