TRINETHRAM NEWS

తహసీల్దార్ ఆనంద్ రావ్ సస్పెండ్ చేయండి బాధితుడు అశోక్,
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్

పరిగి తహసీల్దార్ గా పనిచేస్తున్న ఆనంద్ రావును వెంటనే సస్పెండ్ చెయ్యలని అడిషనల్ కలెక్టర్ లింగ్య నాయక్ కి సిపిఎం నాయకులు ఫిర్యాదు వికారాబాద్ దుద్యాల మండల తహసీల్దార్ గా 2024 సెప్టెంబర్ లో ఆనందరావు పనిచేసినప్పుడు గౌరారం గ్రామానికి చెందిన బోయిని అశోక్ తండ్రి సాయప్పకు సర్వే నంబర్ 57/2అ లో విస్తీర్ణం-1.13 గుంటల భూమి ఉంది.
అశోక్ తండ్రి మరణానంతరం కుమారుడు బోయిని అశోక్ కు విరాసతి చేయవలసిన భూమి తహసీల్దార్ ఆనంద్ రావు అవినీతికి పాల్పడి వేరే వ్యక్తిల నుండి లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని అవినీతికి పాల్పడి సంబంధం లేని వ్యకులకు పట్టాచేసి అశోక్ కు అతని కుటుంబాన్ని అన్యాయం చేసిన పరిగి తహసీల్దార్ ఆనంద్ రావును వెంటనే సస్పెండ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలని నేడు సిపిఎం ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ ఫిర్యాదు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం వెంకటయ్య,బుస్స చంద్రయ్య, కె. శ్రీనివాస్ మాట్లాడుతూ… గతంలో దుద్యాల మండల తాసిల్దార్ పని చేసిన ఆనందరావు ప్రస్తుతం పరిగి తాసిల్దార్ పనిచేస్తున్నారు.
అవినీతి, అక్రమాలకు పాల్పడి అన్యాయంగా ఒక అశోక్ తండ్రి మరణాంతం తండ్రి నుండి వారసత్వంగా కుమారునికి రావలసినటువంటి భూమి లక్షల రూపాయలు డబ్బులు వేరే వ్యక్తుల దగ్గర తీసుకొని వారికి పట్టా చెయ్యడం దుర్మార్గం అన్నారు. ఆనంద్ రావు తాహసిల్దార్ స్థాయి ప్రవర్తన లేదన్నారు. పైసా పేకో తమాషా దేకో అనే చందంగా ఆనంద్ రావ్ వ్యవరిస్తారని అన్నారు.
ఈలాంటి తహసీల్దార్ విధుల్లో ఉండడానికి అనర్హుడు అన్నారు.ఆనంద్ రావు ఈ మండలంలో పనిచేసిన రెండు నెలలలో భూసమస్యల పేరుతో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు. గత సంవత్సర కాలంగా అశోక్ అనే వ్యక్తి తన భూమిని తనకు చేయాలని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ అధికారుల చుట్టూ గత సంవత్సరం నుండి తిరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు. అందుకని తన భూమిని అన్యాయంగా ఇతరులకు పట్టా చేసిన అధికారి అగు ఆనంద్ రావును వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఆనందరావు ప్రస్తుతం పని చేస్తున్న పరిగి మండలం లో కూడా భూ సమస్యలు పరిష్కరిస్తామని పేరుతో ముటేషన్, సక్సేషన్, అక్రమ మట్టి దందా వంటి అనేక రకాల చట్ట విరుద్ధ కార్యక్రమాలు చేస్తూ లక్షల రూపాయలు అవినీతికి పాల్పడుతున్నారని ఇప్పటికే పరిగి ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇలాంటి అధికారులు వల్ల ప్రజలకు, సమాజానికి తీరని నష్టం వాటిల్లుతుందని అన్నారు. అందుకని తక్షణమే పరిగి తహసీల్దార్ ఆనందరావు సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల జిల్లావ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని అధికారాన్నిచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హక్కుల పోరాట సంఘం జిల్లా అధ్యక్షులు కొత్తూరు చంద్రయ్య,బాధితుడు అశోక్, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App