ఆసీస్‌ను ఆలౌట్ చేసిన టీమిండియా.. క్రెడిట్ మొత్తం ఈ బౌలర్ దే..
Trinethram News : ఆస్ట్రేలియాతో జరుగుతున్న పెర్త్ టెస్టులో టీమిండియా (India vs Australia) ఆధిక్యం సాధించింది. భారత బౌలర్ల (Bowlers) విధ్వంసం ముందు ఆస్ట్రేలియా బ్యాటింగ్ సత్తా విఫలమైంది..
పెర్త్ టెస్టులో భారత్ నుంచి అత్యంత విజయవంతమైన బౌలర్ గా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా నిలవడం విశేషం. ఈ మ్యాచులో బుమ్రా ఏకంగా ఐదు వికెట్లను పడగొట్టాడు. ఈ క్రమంలో హర్షిత్ రాణా 3, సిరాజ్ రెండు వికెట్లను తీశారు. దీంతో భారత బౌలర్ల విధ్వంసానికి ఆస్ట్రేలియా ఆటగాళ్లు మొత్తం 104 పరుగులు మాత్రమే చేయగలిగారు.
45 ఏళ్ల రికార్డు
ఈ క్రమంలో పెర్త్‌లో టీమ్ ఇండియా ఆధిక్యంలోకి వచ్చింది. కానీ 45 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టకుండా టీమిండియా నిలిచింది. పెర్త్ టెస్టులో ఆస్ట్రేలియా 79 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి టెస్టుల్లో అత్యల్ప స్కోరుతో ఆలౌట్ అయిన ఆస్ట్రేలియా 45 ఏళ్ల రికార్డును టీమిండియా బద్దలు కొడుతుందని భావిచింది. కానీ సాధ్యం కాలేదు. చివరికి వచ్చిన ఆస్ట్రేలియా జోడీ పరుగులు తీసి ఆ రికార్డు సృష్టించకుండా అడ్డుకున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App