పప్పుడువలస గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పిల్లలు, ఆత్మీయ సమావేశ కార్యక్రమం.
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వేలి మండలం త్రినేత్రం న్యూస్ 08:
అరకు వేలి మండలం చొంపి పంచాయితీ పప్పుడు వలస గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రాథమిక (టి. డబ్ల్యు) పాఠశాల నందు ప్రధాన ఉపాధ్యాయులు బి. కామేశ్వరరావు మరియు భాష పండితు సోమిలి సీతారాం ఆధ్వర్యంలో జరిగిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పిల్లలు, ఆత్మీయ సమావేశం, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎక్స్ సర్పంచ్ గుడివాడ ప్రకాష్ రావు పాల్గొన్నారు, అదే విధంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల యొక్క విద్యాశాఖ వారు ప్రతిష్టాత్మకమైన ఆత్మీయ సమావేశం పేరుతో, ఉపాధ్యాయుడు, తల్లిదండ్రులు, పిల్లలు, యువత, పెద్దలు అందరూ కలిసి, విద్యా ప్రమాణాలు బాగా మెరుగుపడాలని విద్యా అభివృద్ధిలో మన అందరిమి ముందు ఉండాలని విద్యార్థులు, పిల్లలు, ఎటువంటి చెడు వ్యసనాలకు అలవాట్లకు బానిసలు కాకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆత్మీయ సమావేశం కార్యక్రమం చేపట్టింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటువంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేసి రాష్ట్ర విద్యాభివృద్ధిలో ప్రతి ఒక్కరికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యాభివృద్ధిలో ముందుండాలని, తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామంలో ఉన్నటువంటి, గ్రామ వార్డ్ నెంబర్ గుడివాడ సన్యాసమ్మ. మరియు అంగన్వాడి టీచర్స్, హెల్పర్స్, మరియు ఆశ వర్కర్ గ్రామంలో ఉన్నటువంటి సాగర జన్ని శుక్ర, పెట్టెలి రమేష్, చిన్నలు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App