Teacher’s Day Celebrations at Revathi High School
Trinethram News : శంకర్పల్లి : సెప్టెంబర్ 05 : మంచి విద్య ఎవరినైనా మార్చగలదు. సద్గురువు అన్నింటినీ మార్చగలడు. ఉపాధ్యాయులు మన జీవితాలపై ఎంతగానో ప్రభావం చూపుతారని కరస్పాండెంట్ శ్రీనివాస్ అన్నారు. శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని రేవతి హై స్కూల్ లో గురువారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. విద్యార్థులు తమ ప్రియమైన ఉపాధ్యాయుల కోసం తరగతి గదులను పూలమాలలతో అందంగా అలంకరించారు. పాఠశాల ఆడిటోరియంలో వినోద కార్యక్రమాలు నిర్వహించారు.
పాఠశాల కరస్పాండెంట్, అకాడమిక్ డైరెక్టర్ పావని, ప్రిన్సిపాల్ రాజు.. డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ప్రిన్సిపాల్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పై సంక్షిప్త ప్రసంగం చేసి ఉపాధ్యాయ దినోత్సవ విశిష్టతను వివరించారు. టీచర్స్ డే సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ గా పదవ తరగతి విద్యార్థి తనీష్ గౌడ్ అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. తనీష్ గౌడ్ ను కరస్పాండెంట్, అకాడమిక్ డైరెక్టర్, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు అభినందించారు. విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కొంతమంది విద్యార్థులు అందమైన ప్రసంగం కూడా చేశారు. విద్యార్థుల ప్రదర్శనను ప్రిన్సిపాల్ అభినందించారు. కార్యక్రమంలో ఇన్చార్జి అర్చన, సాంబశివరావు, చంద్రశేఖర్, పిటి గణేష్, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
Comments are closed.