Trinethram News : పుల్లలచెరువు మండలం పిఅర్ సి తండా గ్రామంలో 38 కుటుంబాలు వైసీపీ నుండి యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారి సమక్షంలో టిడిపిలోకి చేరడం జరిగింది.
టిడిపి ఇన్చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారు వారిని పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జగన్మోహన్ రెడ్డి పాలన నచ్చకనే తాము టిడిపిలోకి చేరినట్లు వారు తెలిపారు. ఐదేళ్ల పాలనలో యర్రగొండపాలెం నియోజకవర్గ అభివృద్ధి చెందలేదన్నారు. గూడూరి ఎరిక్షన్ బాబు గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని వారు ధీమా వ్యక్తం చేశారు. సైకో పోవాలి సైకిల్ రావాలి అని నినాదాలు చేశారు..
కార్యక్రమంలో పుల్లలచెరువు మండల టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.