Take the implemented welfare schemes to the next level
కలెక్టర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమల్లు
విస్తృతంగా క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టండి
ప్రజా పాలన, ప్రజా ప్రభుత్వం అన్న సందేశాన్ని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లండి
అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కింది స్థాయికి తీసుకెళ్లండి
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా కలెక్టర్లు ఉండాలి
కలెక్టర్లు విస్తృతంగా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి, సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమల్లు అన్నారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ప్రారంభమైన కలెక్టర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలు సూచనలు చేశారు. కొత్త ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు సంక్షేమ పథకాలు కొన్ని జిల్లాల్లో కింది స్థాయి వరకు వెళ్లడం లేదని రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మేము జిల్లాలకు వెళ్లినప్పుడు అర్థమవుతుందని తెలిపారు.
ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని పది లక్షలకు పెంచడం, మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని, అర్హులందరికీ అవి అందేలా చూడాలని ఆదేశించారు. ఇది ప్రజా పాలన, ప్రజా ప్రభుత్వం కొనసాగుతుంది అన్న సందేశాన్ని స్పష్టంగా ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్లాలని సూచించారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు విస్తృతంగా క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తే పలు సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అవుతాయని తెలిపారు. ప్రజలు, ప్రభుత్వానికి మధ్య కలెక్టర్లు వారధి లాంటివారని వివరించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App