పశ్చిమగోదావరి జిల్లా
తాడేపల్లిగూడెం మండలం పెడతాడేపల్లిలో దారుణం…!!!
ఓ విద్యా సంస్థలో కృష్ణ జింక మృతి చెందినట్లు సమాచారం
వన్య ప్రాణుల చట్టానికి నీళ్ళొదులుతూ ఆ పాఠశాల యాజమాన్యం అక్కడ వన్య ప్రాణుల్ని పెంచుతున్నట్లు తెలుస్తుంది
పర్యవేక్షణ లోపం వల్లే కృష్ణ జింక మృతి చెందిందని అంటున్న స్థానికులు
సుమారు 15 నుండి 20 జింకల వరకూ ఆ పాఠశాలలోని తోటలలో ఉన్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం
తరచూ వీటిని అటవీ శాఖాధికారులు పర్యవేక్షిస్తున్నప్పటికీ ఆదివారం జింకల మధ్య జరిగిన కోట్లాటలో ఒక జింకకు బలమైన గాయాలు తగిలినట్లు తెలుస్తుంది
గాయపడిన జింక మృతి చెందగా అటవీ శాఖాధికారుల పర్యవేక్షణలో పశు వైద్యశాఖ అధికారి డాక్టర్ విజయ్ పోస్టుమార్టం నిర్వహించారని తెలిసింది
ఇదే విషయమై పాఠశాల యాజమాన్యాన్ని వివరణ కోరగా జింకల పర్యవేక్షణ చూసుకునేవారు అందుబాటులో లేరని సమాధానం దాటవేయడం శోచనీయం