TRINETHRAM NEWS

స్వానిధి సమృద్ధి క్యాంపునిర్వహించడం జరిగింది

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ స్ట్రీట్ వెండర్స్ లోన్స్ సహాయంతో వ్యాపారంలో దినదిన అభివృద్ధి చెందాలి : వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్
అర్హులైన స్ట్రీట్ వెండర్స్ లోన్స్ సహాయంతో వ్యాపారంలో దినదిన అభివృద్ధి చెందాలని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ అన్నారు. చైర్ పర్సన్ అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ హాల్లో స్వానిధి సమృద్ధి క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 8 రకాల స్కీములకు అర్హులైనవికారాబాద్ మున్సిపల్ పరిధిలో ఉన్న స్ట్రీట్ వెండర్స్ వారి కుటుంబాల నుంచిదరఖాస్తులు స్వీకరించడం జరిగింది అన్నారు. వీటిలో స్ట్రీట్ వెండర్స్ కు వారి కుటుంబసభ్యులకు ఇన్సూరెన్స్ లు, జన్ దన్ బ్యాంకు ఖాతాలు, ఈ శ్రమ్ కార్డులు ఇప్పించడం తదితర అంశాలు ఉన్నాయని చైర్ పర్సన్ వెల్లడించారు. కావునవికారాబాద్ పట్టణంలోని వీధి విక్రయ దారులు ప్రతి ఒక్కరు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ జాకీర్ అహ్మద్, పట్టణ పతాకసమన్వయ అధికారి వెంకటేష్, ఐసిడిఎస్,సూపర్వైజర్ శాలిని, SBI ఫీల్డ్ ఆఫీసర్ జయవర్ధన్, అధికారులు, స్ట్రీట్ వెండర్స్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App