Trinethram News : ఢిల్లీ:
1950 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత అదే ఏడాది 1950 జనవరి 28వ తేదీన సుప్రీం కోర్టు ప్రారంభం అయింది.
ఈ రోజు జనవరి 28వ తేదీకి 75 యేళ్లు పూర్తి చేసుకుని వజ్రోత్సవ వేడుకలు జరుపుకోనుంది.
హాజరవ్వనున్న ప్రధాని నరేంద్ర మోడీ..
డిజిటల్ కోర్టులు 2.0, సుప్రీంకోర్టు కొత్త వెబ్సైట్ ప్రారంభం..
డిజిటల్ ఫార్మాట్లో అందుబాటులోకి రానున్న 36, 308 కేసుల తీర్పులు..
సుప్రీంకోర్టులో ప్రస్తుతం 34 మంది న్యాయమూర్తులు.
ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ చంద్ర చూడ్ తో పాటు సుప్రీం కోర్టు న్యాయ మూర్తులు, కేంద్ర మంత్రులు పాల్గోనున్నారు.