
Trinethram News : పులివెందుల: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఐదో వర్ధంతి సందర్భంగా పులివెందులలో ఘాట్ వద్ద ఆయన కుమార్తె సునీతా నర్రెడ్డి నివాళులర్పించారు. భర్త రాజశేఖర్రెడ్డి, కుటుంబసభ్యులతో కలిసి ఆమె వెళ్లారు..
అనంతరం వివేకా పార్కు వద్ద విగ్రహానికి పూలమాలలు వేశారు.
కడపలో వర్ధంతి సభ.. హాజరుకానున్న షర్మిల, సునీత
మరోవైపు కడపలోని జయరాజ్ గార్డెన్లో నేడు వివేకా వర్ధంతి సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వివేకా సతీమణి వైఎస్ సౌభాగ్యమ్మ, వైఎస్ సునీతతో పాటు వివిధ పార్టీలకు చెందిన నేతలు, వివేకా ఆత్మీయులు హాజరుకానున్నారు. పులివెందులలోనే నిర్వహించాలని ఏర్పాట్లు చేసినా ఫంక్షన్ హాల్ కూడా ఇవ్వకుండా వైకాపా నేతలు అడ్డంకులు సృష్టించారని కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ సభలో షర్మిల, సునీత సీఎం జగన్ను లక్ష్యంగా చేసుకుని పదునైన విమర్శలు చేసే అవకాశముంది..
