విజయత్సవంగా పారా గ్లైడింగ్
(ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి వి .అభిషేక్ )
అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్. జనవరి 20:
ప్రముఖ పర్యట కేంద్రం మాడగడ సన్రైజ్ పాయింట్ వద్ద ప్రయోగాత్మకంగా నిర్వహించిన పారాగ్లైడింగ్ విజయవంతంగా నిర్వహించడం జరిగిందని ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి వి అభిషేక్ తెలియజేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆదివారం హిమాచల్ ప్రదేశ్ ఆరెంజ్ పారా గ్లెడింగ్ స్కూల్ పైలట్ శిక్షకులు విజయ్ సోనీ నేతృత్వంలో పారా గ్లైడింగ్ ట్రైనీ అలిషా విజయవంతంగా నిర్వహించారని చెప్పారు. విజయ్ సోనీ మాట్లాడుతూ మాడగడ ప్రాంతం పారా గ్లైడింగ్ కు అత్యంత అనుకూలంగా ఉందన్నారు. పర్యాటకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని చెప్పారు. అరుకు చలి ఉత్సవం సందర్భంగా పెరా ఏర్పాటు చేస్తున్నామని పి.వో చెప్పారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App