TRINETHRAM NEWS

గ్రూప్- 3 పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ

*18 పరీక్షా కేంద్రాలలో 8 వేల 947 మంది అభ్యర్థులకు ఏర్పాట్లు

*గ్రూప్ 3 పరీక్షల నిర్వహణ పై సంబంధిత అధికారులతో సమీక్షించిన అదనపు కలెక్టర్

పెద్దపల్లి, నవంబర్ -13: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

జిల్లాలో గ్రూప్ 3 పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ అన్నారు.

బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ టిజిపిఎస్సి గ్రూప్ -3 పరీక్షా ఏర్పాట్లు, సన్నద్ధతపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

అదనపు కలెక్టర్ జే.అరుణ మాట్లాడుతూ, షెడ్యూల్ ప్రకారం నవంబర్ 17 ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 వరకు రెండు సెషన్లు, నవంబర్ 18న ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు గ్రూప్ 3 పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పక్కాగా జరగాలని అధికారులకు అదనపు కలెక్టర్ సూచించారు.

గ్రూప్ 3 పరీక్షను పెద్దపల్లి జిల్లాలో మొత్తం 8 వేల 946మంది అభ్యర్థులు పాల్గొంటున్నారని వీరి కోసం 18 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. ప్రతి 3 పరీక్ష కేంద్రాలకు తహసిల్దార్ ఆధ్వర్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేసామని, పారదర్శకంగా పరీక్షలు జరిగేలా చూడాలని అదనపు కలెక్టర్ సూచించారు.

గ్రూప్ పరీక్షల నిర్వహణకు ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి అక్కడ అవసరమైన మౌలిక వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రశ్న పత్రాలను పరీక్ష కేంద్రాలకు తరలించేందుకు వీలుగా జాయింట్ రూట్ అధికారులను నియమించాలని అన్నారు.

ప్రతి 150 మంది అభ్యర్థులకు ఒక జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ సిబ్బందిని ఐడెంటిఫికేషన్ అధికారులు గానీ నియమించామని, ప్రతి అభ్యర్థిని క్షుణ్ణంగా పరిశీలించి పరీక్ష కేంద్రంలోకి అనుమతించడం జరుగుతుందని అదనపు కలెక్టర్ తెలిపారు.

పరీక్ష రాస విద్యార్థులకు అవసరమైన త్రాగునీటి సౌకర్యం కల్పించాలని, పరీక్ష కేంద్రాలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండాలని, బెల్ ఏర్పాట్లు చేయాలని, పరీక్ష కేంద్రాలకు చీఫ్ సూపరింటెండెంట్ మినహా ఎవరికి సెల్ ఫోన్ అనుమతి లేదని, ఎవరు ఫోన్ తీసుకొని రావద్దని అన్నారు. పరీక్షా కేంద్రం పరిసరాలలో 144 సెక్షన్ అమలు చేయాలని, జిరాక్స్ షాపులు మూసివేయాలని సూచించారు.

పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులను ఉదయం సెషన్ లో 8.30 నుంచి, మధ్యాహ్నం సెషన్ లో 1.30 నుంచి అనుమతించడం జరుగుతుందని, పరీక్ష కేంద్రాల గేటు ఉదయం 9.30 గంటలకు, మధ్యాహ్నం 2.30 గంటలకు మూసి వేస్తామని, దీని తర్వాత పరీక్ష కేంద్రాలకు ఎవరిని అనుమతించడం జరగదని, ఈ అంశాన్ని అభ్యర్థులకు చేరేలా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో కలెక్టరేట్ సి విభాగం సూపరింటెండెంట్ ప్రకాష్, సంబంధిత అధికారులు,
తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App