TRINETHRAM NEWS

Trinethram News : నల్లజర్ల (పోతవరం) మార్చి 13
నల్లజర్ల మండలం పోతవరం గ్రామంలో రాజమండ్రి ఎంపీ భరత్ రామ్ 20 లక్షలు
ఎంపీ నిధుల నుంచి మంజూరు చేసిన బీసీ కమ్యూనిటీ భవనాన్ని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత బుధవారం రాత్రి ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి తానేటివనితో రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్చార్జి, ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. బీసీల అభ్యున్నతి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న విశేష కృషి చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, బీసీ నాయకులు, వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని మంత్రి తానేటి వనిత, ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ లకు ఘన స్వాగతం పలికారు.