State government loan waiver for farmers
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసిన సందర్భంగా గోదావరిఖని గాంధీ చౌరస్తాలో సంబరాలలో ముఖ్య అతిథిగా విచ్చేసిన రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాగూర్
రైతు పంట పథకం రుణమాఫీ 2024 మారదర్శకాలు విడుదల చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు సహకరించిన ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు రాష్ట్ర మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలిపారు
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయడాన్ని స్వాగతిస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాణాసంచా పేల్చి, మిఠాయిలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మేయర్ అనిల్ కుమార్, కాంగ్రెస్ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా పాలనలో రాష్ట్ర ప్రజలకు అన్ని సంక్షేమ ఫలాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. తాము ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నట్లు పేర్కొన్నారు. రుణమాఫీ ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో రైతులకు మేలు కలుగుతుందని అన్నారు.
రుణమాఫీ పంపిణీ చేస్తే రాజీనామా చేస్తానని ప్రకటించిన బిఆర్ఎస్ నేత హరీష్ రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App