TRINETHRAM NEWS

Staff and patients suffering from minimal facilities or difficulties

అస్త వ్యస్తంగా మారిన ప్రభుత్వ ఆసుపత్రి

కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్న సిబ్బంది మరియు రోగులు

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ముత్తారం మంథని మండలం మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస వసతులు అయిన మరుగుదొడ్లు,మరియు మంచినీళ్ళ సదుపాయం లేక సిబ్బంది మరియు రోగులు అవస్థలు పడుతున్నారు.

ఆసుపత్రికి వెళ్లిన మహిళలు గర్భవతులు వినియోగించుకోవడానికి వీలు లేని విధంగా మరుగుదొడ్లు మారిన పరిస్థితి, సుధూర ప్రాంతాల నుండి వచ్చే వారు మళ్ళీ ఇంటికి చేరే వరకు వేచి ఉండాల్సి వస్తుంది, సుంకుల్లో మురికి కాలువ మాధురి ఉండడం, రోగులకు తగడానికి మంచి నీరు కూడా అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులకు గురి అవుతున్నామని ప్రజలు అంటున్నారు .

సిబ్బంది ; ఆసుపత్రిలో 24 విధులు నిర్వహించకపోవడానికి కారణం కనీస వసతులు అయిన మంచినీళ్లు, డ్రెస్సింగ్ రూమ్ లు అందుబాటులో లేకపోవడమే అని చెప్తున్నారు మహిళ సిబ్బంది అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారం మాత్రం చూపడం లేదని అంటున్నారు మండల కేంద్రము పక్కనే ఎంఆర్ఓ, ఎంఈఓ కార్యాలయాలు ఉండడం వలన ఎప్పుడూ రద్దీగా ఉండే పరిసరాల్లో మరుగుదొడ్లు లేక ఆరుబయటకు వెళ్ళే పరిస్తితి కూడా రోగులకు కరువయ్యింది అని చెప్తున్నారు,

రోగులు, సిబ్బంది పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ సమస్యలపై పరిష్కరం చూపాలని ప్రజలు కోరుకుంటున్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Staff and patients suffering from minimal facilities or difficulties