TRINETHRAM NEWS

Trinethram News : తిరుమల : శ్రీవారి భక్తుడు, హైదరాబాద్‌కు చెందిన కొండా విజయ్‌కుమార్‌ గురువారం తిరుమలలో సందడి చేశారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో దాదాపు పది కిలోల బరువైన ఆభరణాలు ధరించి స్వామివారిని దర్శించుకున్న ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు భక్తులు పెద్దఎత్తున గుమిగూడారు. మెడలో చాంతాడంత చైన్లు, చేతికి కడియాలు, ఉంగరాలు, బంగారు వాచ్‌తో సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హోప్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తూ పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, భక్తులను దర్శనాలకు తీసుకురావడంతోపాటు అన్నదాన కార్యక్రమాలు సొంత నిధులతో చేపడుతున్నట్లు చెప్పారు.