ఓం శ్రీ గురుభ్యోనమః
పంచాంగం
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 04 – 01 – 2024,
వారం … బృహస్పతివాసరే ( గురువారం )
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయనం – హేమంత ఋతువు,
మార్గశిర మాసం – బహళ పక్షం,
తిథి : అష్టమి సా6.23 వరకు,
నక్షత్రం : హస్త మ2.48 వరకు,
యోగం : అతిగండ తె4.35 వరకు,
కరణం : కౌలువ సా6.23 వరకు,
వర్జ్యం : రా11.27 – 1.11,
దుర్ముహూర్తము : ఉ10.15 – 10.59 &
మ2.39 – 3.23,
అమృతకాలం : ఉ8.16 – 10.01,
రాహుకాలం : మ1.30 – య3.00,
యమగండo : ఉ6.00 – 7.30,
సూర్యరాశి : ధనుస్సు,
చంద్రరాశి : కన్య,
సూర్యోదయం : 6.36,
సూర్యాస్తమయం: 5.35,
నేటి విశేషం
కాలాష్టమి /కాలభైరవాష్టమి
ఒకానొక సందర్భంలో ‘ బ్రహ్మ గర్వం అణచడానికి శివుడు హూంకరించగా, ఆ హూంకారంనుండి ఒక భయంకర రూపం వెలువడుతుంది.
ఆరూపమే కాలభైరవస్వామి. శివుడి ఆదేశం మేరకు బ్రహ్మ మధ్యతలను కాలభైరవుడు చిటికెన వేలుగోటితో తెంపేస్తాడు.
అలా బ్రహ్మ శిరస్సు తెగిపడిన ప్రదేశమే ‘బ్రహ్మకపాలం’గా ప్రసిద్ధిచెందింది.
కాశీనగరంలో అడుగుపెట్టగానే కాలభైరవుడికి బ్రహ్మహత్యా పాతకం తొలగిపోతుందనీ, కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా ఉండమని శివుడుఆదేశిస్తాడు. అలా కాశీక్షేత్రానికి చేరుకున్న కాలభైరవుడు భక్తులతో పూజలందుకుంటూ విరాజిల్లు తున్నాడు.
కాశీ క్షేత్రంలోని ఆ ప్రాంతమే కపాలమోచన దివ్య తీర్థంగా ప్రసిద్ధి చెందింది.
ఇక్కడ పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు, ఈ తీర్థానికి ఎదురుగా కాలభైరవుడు కొలువుదీరాడు. స్థానికులు లాట్ భైరవ అని పిలుచుకుంటారు.
ఈ క్షేత్రంలో మహా భైరవాష్టమిని ఘనంగా జరుపుతారు, కార్తికమాసంలోని కృష్ణపక్ష అష్టమినే కాలభైరవాష్టమిగా, కాలభైరవ జయంతిగా జరుపుకుంటారు.
మార్గశిర కృష్ణపక్ష అష్టమిని మహా భైరవాష్టమిగా కొన్ని ప్రాంతాల్లో నిర్వహించుకునే వారూ ఉన్నారు.
ఆ రోజు కాలభైరవుడి సన్నిధిలో జాగరణ చేస్తారు…
కాశీ క్షేత్రపాలకుడిగానే కాకుండా అనేక క్షేత్రాల్లో ఆయన క్షేత్ర పాలకుడిగా ఉంటాడు.
అసితాంగ భైరవుడు,
రురు భైరవుడు,
చండ భైరవుడు,
క్రోధ భైరవుడు,
ఉన్మత్త భైరవుడు,
కపాల భైరవుడు,
భీషణ భైరవుడు,
సంహార భైరవుడు అనే ఎనిమిది నామాలతో వివిధ ముద్రలతో భైరవుడు దర్శనమిస్తుంటాడు.
ఎదుట నిలిచిన ఏలాంటి శక్తి అయినా కాలభైరవుడి శక్తిని తట్టుకోవడం కష్టం…
భైరవః పూర్ణ రూపోహి శంకరస్యపరాత్మనః
మూఢాస్త్రంపై జానంతి మోహితాశ్శివమాయయా
అంటుంది శతరుద్రసంహితం. శివపురాణం, కాశీఖండం కాలభైరవుడి గొప్పదనాన్ని కొనియాడాయి.
భైరవుడిని స్మరించుకోవడానికైనా ఓ యోగం ఉండాలంటారు,
పరమశివుడు మనలను ఓ రకమైన మాయాలో పడేస్తాడట.
ఆ మాయాపొర తొలగిననాడు కాలభైరవుడు దర్శనమిస్తాడట.
కాలభైరవ ఉపాసన ప్రాచీనమైంది.
కాశీ మహానగరం, ఉజ్జయిని తదితర ప్రాచీన క్షేత్రాల్లో కాలభైరవుడి ఆలయాలున్నాయి.
కాలభైరవుడి నిశనివారంతో కూడిన త్రయోదశిరోజున నువ్వులనూనెతో అభిషేకించాలి.
ఈ విధంగా చేయడం వలన పాపాలు, దోషాలు, గ్రహపీడలు, దీర్ఘకాలికవ్యాధులు తొలగిపోతాయని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు.
శ్రీకాలభైరవపూజను స్త్రీలు పురుషులు అన్నివర్గాలవారు చేయవచ్చు.
కాలభైరవపూజ చేసేవారు నల్లని వస్త్రాలు ధరిస్తే మంచిది. కాలభైరవుడి విగ్రహానికిగాని, చిత్రపటానికిగాని పూజచేయవచ్చు.
శనివారం, మంగళవారం కాలభైరవుడికి ప్రీతికరమైనరోజులు.
పూజలో కాలభైరవుడికి మినపగారెలు నివేదించాలి, కాలభైరవపూజ ప్రదోషకాలంలో అంటే సాయంత్రం 5.30 – 6.30 గం.లమధ్య చేస్తే మంచిది,
అనుభవజ్ఞులైన పండితులతో కాలభైరవ హోమంచేయించుకుంటే సకల గ్రహబాధలు అనారోగ్యబాధలు తొలిగిపోతాయి.
కాశీక్షేత్ర పాలకుడు, పరమేశ్వరుడి పూర్ణాంశ అయిన కాలభైరవుడికి నమక మంత్రాల సహితంగా పురాణోక్త శ్లోకాలతో వేద పండితులతో పూజ చేయించుకోవాలి.
అలాగే శ్రీ కాలభైరవ సహస్రనామస్తోత్రం, నామావళి,
శ్రీకాలభైరవాష్టకం, తీక్షదంష్ట్ర కాలభైరవ అష్టకం, భైరవ కవచం, స్తోత్రాలు పఠించిన, విన్నా కూడా భైరవానుగ్రహం లభిస్తుంది.
శుభమభూయత్
సమస్త లోకా సుఖినోభవంతు