గోదావరిఖని కోదండ రామాలయంలో మరియు అయ్యప్ప స్వామి శివాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన
రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఎమ్మెల్యే పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ కమిటీ అర్చకులు గోదావరిఖని కోదండ రామాలయం లో అదేవిధంగా అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయా ఆలయంలో ఉన్నటువంటి భక్తులను ఆప్యాయంగా పలకరించుకుంటు వారి గురించి తెలిసుకుంటు, ప్రజలందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలిపారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి రామగుండం నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, అన్ని ప్రాంతాల్లో ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి తగినంత పెట్టుబడులు ప్రభుత్వ పెద్దల సహకారాన్ని అందిపుచ్చుకుని రామగుండం నియోజకవర్గంను అభివృద్ధి చేసేలా ఆ భగవంతుని ఆశీర్వాదాలు ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, సీనియర్ నాయకుకు, అయ్యప్ప స్వామి భక్తులు, తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App