TRINETHRAM NEWS

ఆర్ ఎస్ ఆర్ లో క్యాన్సర్ పై ప్రత్యేక కార్యక్రమం

త్రినేత్రం న్యూస్ :ఫిబ్రవరి 5: నెల్లూరు జిల్లా. బోగోలు మండలం కడనూతల గ్రామంలో గల రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో (వరల్డ్ క్యాన్సర్ డేని) పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పివిఎన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ , ఈ కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకురాలైన డాక్టర్ లక్ష్మి వరల్డ్ క్యాన్సర్ డే, గురించి ప్రసంగించినట్లు వారు తెలిపారు.

డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ క్యాన్సర్ రావడానికి గల కారణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, దాని అనర్ధాలు గురించి విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

World Cancer Day