TRINETHRAM NEWS

Special measures for monitoring uninterrupted power supply in hospitals

ఆసుపత్రులలో నిరంతరాయ విద్యుత్ సరఫరా పర్యవేక్షణకు ప్రత్యేక చర్యలు

పెద్దపల్లి విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ బొంకూరి సుదర్శన

పెద్దపల్లి, మే -23: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

జిల్లాలోని ఆసుపత్రులు, వైద్య కళాశాలలకు నిరంతరం విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు పెద్దపల్లి విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ బొంకురి సుదర్శన్ గురువారం తెలిపారు
తెలంగాణ రాష్ట్ర ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ సంచాలకులు/ వరంగల్ హెచ్.ఆర్.డి. రామగుండం ప్రభుత్వ వైద్య కళాశాలను విద్యుత్ అధికారులతో కలిసి బుధవారం తనిఖీ చేయడం జరిగిందని, సింగరేణి ప్రభుత్వ వైద్య కళాశాలలో 320 కేవిఎ జనరేటర్ అందుబాటులో ఉందని, ఏదైనా సాంకేతిక ఇబ్బంది వల్ల విద్యుత్ సరఫరా అవాంతరం ఏర్పడినప్పుడు జనరేటర్ ను ఉపయోగిస్తున్నట్లు వైద్య కళాశాల వర్గాలు తెలిపారన్నారు
జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యుత్ సరఫరాకు సంబంధించి సమస్య ఉంటే విద్యుత్ అధికారులతో సంప్రదించడానికి ప్రత్యేక వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేస్తున్నామని, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుందని, ఆసుపత్రిలో రోగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Special measures for monitoring uninterrupted power supply in hospitals