విద్యాసంస్థల ప్రవేశ పరీక్ష పోస్టర్ విడుదల చేసిన స్పీకర్ ప్రసాద్ కుమార్
త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని తెలంగాణ గురుకుల విద్యాసంస్థల ప్రవేశ పరీక్షల పోస్టర్ ను రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆవిష్కరించారు. రాష్ట్రంలో 2025 2026 విద్య సంవత్సరానికి 5 వ తరగతి కి ఎస్సీ, ఎస్టీ,బీసీ, మరియు జనరల్ గురుకులలో అలాగే ఎస్సీ ఎస్టీ గురుకులాల్లో 6 వ తరగతి నుండి 9వ తరగతికి గల బ్యాక్ లాగ్ ఖాళీలాలకి జరుపు ప్రవేశ పరీక్షకి ఆర్వతగల విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం పరుచుకొని ఉన్నత విద్యావంతులు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
క్యాంపు ఆఫీస్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మోమిన్ పెట్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, కాలేజ్ ప్రిన్సిపాల్ ch. ఉషా కిరణ్ ,మరియు బట్వరం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ప్రిన్సిపాల్ సునిత మరియు తదితరాలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App