_తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. మరికొద్ది గంటల్లో ఈ జిల్లాలో వర్షాలు
భిన్న వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఐఎండీ శుభవార్త చెప్పింది. మరో 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు అండమాన్ తీరాన్ని తాకుతాయని తెలిపింది. మరోవైపు ద్రోణి ప్రభావంతో నాలుగు రోజుల్లో ఏపీలో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరోసారి చల్లటి కబురు చెప్పింది.
ఈ రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని.. అంచనా వేసింది.
తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్, సంగారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, భువనగిరి, మెదక్, కామారెడ్డి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురువనున్నట్లు తెలిపారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, ప్రకాశం జిల్లా, అనకాపల్లి జిల్లాలో ఈదురు గాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే మంగళవారం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసాయి.
అలాగే హైదరాబాద్ మహానగరంలో కురిసిన భారీ వర్షానికి పట్టణం అతలాకుతలం అయింది.
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మే 16 నుండి 21 మధ్య ఏ.పీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం.
దీంతో రాష్ట్రంలో వాతావరణం చల్లబడినప్పటికి మళ్లీ ఎండలు దంచికొట్టాయి.