TRINETHRAM NEWS

శివ శంకర్. చలువాది

ఇంతకీ చెక్ బౌన్స్ అంటే ఏమిటి?

బౌన్స్‌ అయితే ఏం చేయాలి..

ఇలాంటి విషయాల గురించి తెలుసుకుందాం.

చెక్ బౌన్స్ అయితే నేరంగా పరిగణించబడుతుంది.

చెక్ బౌన్స్ అయితే దానికి శిక్ష విధించే నిబంధన ఉంది.

శిక్ష మాత్రమే కాదు జరిమానా కూడా చెల్లించాలి.

ఒక చెక్ బౌన్స్ అయితే, చెక్కు ఇచ్చిన వ్యక్తిని దోషిగా పరిగణిస్తారు.

అంటే, ఎవరైనా మీకు చెక్ ఇచ్చి, అది బౌన్స్ అయితే, ఆ వ్యక్తి దోషి అవుతాడు.

మీరు ఎవరికైనా చెక్‌ ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి బ్యాంకుకు వెళ్లిప్పుడు మీ అకౌంట్లో డబ్బులు లేనప్పుడు చెక్‌ బౌన్ష్‌ అవుతుంది. చెక్ బౌన్స్ అయితే, ఆ వ్యక్తికి లీగల్ నోటీసు పంపడం జరుగుతుంది. దీనికి సదరు వ్యక్తి 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో అతనిపై నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881 కింద కేసు నమోదు చేయవచ్చు.

ఈ చట్టంలోని సెక్షన్ 148 కింద చెక్ బౌన్స్ కేసు కూడా నమోదు చేయవచ్చు. ఇది శిక్షార్హమైన నేరం. ఇందులో దోషికి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అంతే కాదు చెక్ బౌన్స్ అయితే జరిమానా కూడా చెల్లించాల్సి రావచ్చని గుర్తించుకోండి. పెనాల్టీతో పాటు బౌన్స్ అయిన చెక్కుకు కూడా పెనాల్టీ విధిస్తారు. ఇది చెక్కుపై రాసిన మొత్తం రెండింతలు కూడా కావచ్చు.

అయితే, చెక్‌ రాసిన తర్వాత మీ అకౌంట్లో డబ్బులు లేని సమయంలో మాత్రమే ఇది జరుగుతుంది. చెక్కు బౌన్స్ అయినప్పుడు వినియోగదారునికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి. చెక్ బౌన్స్‌కు 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష ఉంటే, అది బెయిలబుల్ నేరం. ఇందులో తుది నిర్ణయం వెలువడేంత వరకు జైలు తప్పదు. ఈ కేసులో ఎవరైనా శిక్షించబడితే, అతను క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 389(3) ప్రకారం ట్రయల్ కోర్టు ముందు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇలా చెక్కు విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరికైనా చెక్‌ రాసి ఇచ్చినప్పుడు ఆ చెక్‌పై ఎంత మొత్తం రాసి ఇచ్చారో అంత మొత్తం మీ బ్యాంకు అకౌంట్లో ఉండాలని గుర్తించుకోండి. ఒకవేళ వ్యక్తికి కాకుండా ఏదైనా కంపెనీకి గానీ, షాపింగ్‌ విషయంలో, లేదా ఏదైనా బైక్‌ కొనుగోలు చేసినప్పుడు, లేదా ఏదైనా వస్తువు కొన్నప్పుడు షాపు యజమానికి ఇచ్చిన చెక్‌ బౌన్స్‌ అయిన సందర్భంలో వారు చెక్‌బౌన్స్‌ కేసు వేయకుండా కొంత పెనాల్టీ ఛార్జీ విధించవచ్చు. ఆ సమయంలో వారు వేసిన ఎంత పెనాల్టీ చెల్లించమంటే అంత చెల్లించాల్సి ఉంటుంది. లేకుంటే మీపై కేసు వేసే అవకాశాలు కూడా ఉంటాయి.