
వరుస ఘటనలతో పోలీసులకు సవాలుగా మారిన గోవుల స్మగ్లింగ్
అర్ధరాత్రి గోవుల అపహరణ
గూడూరు రెండో పట్టణ పోలీసు స్టేషన్ లో వరుస ఫిర్యాదులు
Trinethram News : తిరుపతి జిల్లా గూడూరులో గోవులు మాయం మిస్టరీగా మారింది. వరుస ఘటనలతో “పుష్ప” స్మగ్లింగ్ ను తలపించేలా నెంబరు ప్లేట్ లేని రక రకాల వాహనాల్లో గోవులను స్మగ్లింగ్ చేయడం తిరుపతి జిల్లా గూడూరులో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత 20 రోజులుగా సుమారు 150కి పైగా, కోటి రూపాయల విలువైన గోవులు మాయం అయినట్లు అంచనా. ఇక్కడ మాయమవుతున్న గోవులు సముద్ర మార్గంలో విదేశాలకు అక్రమంగా ఎగుమతి అవుతున్నాయా..?
అనే అనుమానాలు లేకపోలేదు. భారతీయ జీవన విధానంలో భాగమైన గోవులను అంతం చేసేందుకు రెండు, మూడు ముఠాలుగా ఏర్పడి గోవులకు మత్తు ఇచ్చి వాటిని ప్యాసింజర్, ట్రక్ లలో ఎక్కించి అర్ధరాత్రి వేళ అక్రమంగా తరలించుకు వెళుతున్నట్లు సిసి కెమెరాల్లో రికార్డయిన వీడియోల్లో కనిపిస్తోంది. గూడూరు నిమ్మ మార్కెట్లో ఎద్దుల బండ్లు వద్ద కట్టి ఉంచిన ఎద్దుల అపహరణతో మొదలు పెట్టిన పర్వం నేటికీ కొనసాగుతోంది. గోవుల అదృశ్యం పై గూడూరు రెండో పట్టణ పోలీసు స్టేషన్ లో సుబ్బారెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సిసి పుటేజీలను పరిశీలించిన పోలీసులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున గోవులను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. జాతీయ రహదారిపై భూదనం టోల్ ప్లాజా వద్ద సిసి పుటేజీల పరిశీలించారు. గూడూరు శివారు ప్రాంతాల్లో గోవధ ఏమైనా జరుగుతుందా అనే కోణంలో పోలీసు దర్యాప్తు సాగుతుంది. గోవుల యజమానులు విశ్వహిందూ పరిషత్, బ్లూ-క్రాస్ సంస్థలకు సమాచారం ఇవ్వడంతో ఆ సంస్థల ప్రతినిధులు సోమవారం తిరుపతి జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసేందుకు సిద్ధం అవుతున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
