నేలపైనే నిద్ర.. కొబ్బరి నీళ్లే ఆహారం.. మోదీ ఉపవాస దీక్ష
అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో ప్రధాని మోదీ కఠిన ఉపవాస దీక్ష కొనసాగిస్తున్నారు.
ప్రధాని నేలపైనే నిద్రిస్తున్నారని, కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఈ నెల 12న మోదీ ఉపవాసం ప్రారంభించారని.. 22 వరకు ‘యం నియమం’ పాటిస్తారని అధికారులు తెలిపారు.
ఈ నియమంలో సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం, ధ్యానం, యోగా, సాత్విక ఆహారం, కఠినమైన తపస్సు లాంటివి ఉంటాయని వివరించారు.