SIT’s preliminary report on the riots is ready
ఏపీలో జరిగిన పోస్ట్‌పోల్ అల్లర్లపై దర్యాప్తు చేసిన సిట్..ప్రాథమిక నివేదిక సిద్ధం చేసింది. మూడు జిల్లాల్లో జరిగిన ఘటనలపై ఆరా తీసిన సిట్.. FIRలలో అదనపు సెక్షన్లు చేర్చడంతో పాటు మరికొంతమందిని నిందితులుగా గుర్తించింది. నేడు డీజీపీకి ప్రాథమిక నివేదిక ఇవ్వనున్న సిట్ చీఫ్..పూర్తి నివేదికను వీలైనంత త్వరగా ఇచ్చేందుకు సమాయత్తమవుతున్నారు.
ఏపీలో ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ కీలక సమాచారాన్ని సేకరించింది. ఇప్పటికే పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో అల్లర్లు జరిగిన ప్రాంతాలకు వెళ్లి స్థానికులు, పోలీసుల ద్వారా అసలేం జరిగిందో తెలుసుకున్నారు. తాడిపత్రి అల్లర్లపై నమోదైన కేసుల వివరాలను సిట్ బృందం పరిశీలించింది. పోలింగ్‌కు ముందు, పోలింగ్ తరువాత జరిగిన గొడవలకు కారణాలను SHOలను అడిగి తెలుసుకున్నారు.
ఇప్పటికే ప్రాథమిక నివేదిక సిద్ధం చేసిన సిట్ టీమ్.. మరికొంతమంది నిందితులను కూడా గుర్తించింది. అయితే సిట్ నివేదికలో ఏఏ అంశాలను ప్రస్తావిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App