Singareni’s economic progress should be discussed in the assembly and profit share should be announced –CITU
మెండె శ్రీనివాస్
రాష్ట్ర ప్రచార కార్యదర్శి
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గత ఆర్థిక సంవత్సరం గడిచి మూడు నెలలు దాటిన ఇంకా సంస్థకు లాభాలు ఎన్ని వచ్చాయనేది ఇప్పటివరకు ప్రకటించలేదు. గత ఎంపీ ఎన్నికలకు ముందు ఎన్నికల కోడ్ ముగిసాక లాభాలు ప్రకటిస్తామని చెప్పడం జరిగిందని. అయినప్పటికీ ఇప్పటికీ లాభాలు ప్రకటించలేదు. గత ఆర్థిక సంవత్సరం సంస్థ నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని 100% సాధించుకోవడం జరిగిందని.
దినితో ఈ ఆర్థిక సంవత్సరంలో లాభాలు భారీగానే వచ్చినట్లు తెలుస్తోందని. టిఆర్ఎస్ ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సింగరేణిలో లాభాల ప్రకటన తొందరగా జరుగుతుంది. ఉద్యోగస్తుల వాట సైతం స్కూలు పిల్లల చదివింపులకు ఇబ్బందులు సమయానికి అందుతాయని ఆశలు పడ్డ కార్మికులకు అడియాసలే మిగిలాయని. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో లాభాలు భారీగానే చూపించడానికి యాజమాన్యం పూర్తిస్థాయిలో కచ్చితత్వంతో అడిట్ నిర్వహిస్తూ తర్జనభజన పడుతుందని తెలుస్తుంది.
ప్రతి సంవత్సరం మాదిరిగానే దసరాకు ముందే వాటా ప్రకటించి చెల్లిస్తారా లేదా? ప్రభుత్వ మారాక ఆయన లాభాల వాట ప్రకటన చెల్లింపు టిఆర్ఎస్ ప్రభుత్వం కంటే భిన్నంగా ఉంటుందా అని కార్మికులు ఎదురుచూస్తున్నారని.
అసెంబ్లీలో ప్రకటించే అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక తొలిసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున ఈసారి సింగరేణి ఆర్థిక ప్రగతి పై పూర్తిస్థాయి చర్చ జరిపి లాభాలు వాటి ప్రకటిస్తారని కార్మికులు ఎదురుచూస్తున్నారని. అసెంబ్లీ సమావేశాలలోనైనా కార్మికుల చిరకాల కోరిక అయిన సొంతింటి పథకం, అలవెన్స్ లపై ఆదాయ పన్ను మాఫీ, మారు పేర్లు వంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని సింగరేణి కార్మికులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారని.
అసెంబ్లీ సమావేశాలలో టిఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి రాజకీయంగా, ఆర్థికంగా వాడుకుంటున్నారని ఆరోపించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఎంత మేర నష్టం కలిగించిందో సభాముఖంగా తెలియజేసి సంస్థకు చెల్లించే బకాయిలపై ఒక స్పష్టతనిచ్చే అవకాశం ఉందని కార్మికులు భావిస్తున్నారని. గతంలోనూ సింగరేణి లాభాలను అసెంబ్లీలో ప్రకటించిన సందర్భాలు ఉన్నందున ఈసారి సమావేశాలు ఇంకో వారం రోజులు జరిగే అవకాశం ఉన్నందున చర్చ జరపాలని తమ సమస్యలు తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఎంత మేర పరిష్కరిస్తారని రాజకీయ జోక్యాన్ని ఎంత మేరకు తగ్గిస్తారో తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా బొగ్గు గనుల వేలం పాట పైన చర్చ జరిపి కార్మికులకు తాము సింగరేణి సంస్థకు అండగా ఉంటామని తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని అన్నారు,
లాభాల వాటా పెరిగేనా?
టిఆర్ఎస్ ప్రభుత్వం వాటాను కొద్దికొద్దిగా పెంచుకుంటూ 32 శాతం లాభాలను గత సంవత్సరం వరకు చెల్లించారు. ఈసారి సింగరేణి నిర్వహించిన ఎన్నికల్లో గుర్తింపు సంఘాలుగా గెలిచిన సిపిఐ అనుబంధంగా ఏఐటియుసి మరియు కాంగ్రెస్ అనుబంధంగా ఉన్న ఐఎన్టియుసిలు ప్రాతినిథ్య సంఘంగా కొనసాగుతునందున టీబీజీకేస్ గుర్తింపు సంఘంగా కొనసాగినన్ని రోజులు 35శాతం వాటాకై డిమాండ్ చేసి నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా కొనసాగుతున్నందున 35% వాటా చెల్లిస్తారని కార్మికులు ఆశతో ఎదురుచూస్తున్నారని.
ప్రతిపక్షంలో ఉండగా డిమాండ్ చేసి అధికారం దక్కినాక 35% చెల్లించకపోతే కార్మికుల్లో చులకనయ్యే అవకాశం లేకపోలేదని. ఇప్పటికే 35% చెల్లించాలంటూ వినతి పత్రాలైతే ఇస్తున్నారు కానీ గుర్తింపు పత్రాలు తీసుకొని అధికారికంగా ముఖ్యమంత్రిని కలిసి చర్చిస్తారా లేక టిఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే ప్రభుత్వంకు వదిలేసి వాటా ప్రకటించాక మా పోరాటం అనేది గొప్పలు చెప్పుకుంటారా వేచి చూడాలని.
ఏది ఏమైనా గత సంవత్సరం కన్నా ఉత్పత్తి పెరిగినందున లాభాలు పెరిగే అవకాశం ఎంతైనా ఉన్నదని దానితోపాటు వాటా పెరుగుతాయని, కార్మికులు కష్టానికి ప్రతిఫలం లభించినట్లు అవుతుందని ఇచ్చే లాభాల వాటానైనా తొందరగా ఇస్తే కార్మికుల పిల్లల చదువులకు పనికొచ్చే అవకాశం ఉన్నందున ఈ సమావేశాల్లో వాటా ప్రకటించి చెల్లింపు తేదీని కూడా ప్రకటించాలని కార్మికులు కోరుతున్నారని.
సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రచార కార్యదర్శి డిమాండ్ చేశారు
అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నందున సింగరేణికి రావాల్సిన బకాయిల విడుదల చేసి కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అలవెన్స్లపై ఐటి మాఫీ మారు పేర్లు సొంతింటి కలలకు నెరవేర్చాలని రాజకీయ జోక్యాన్ని తగ్గించి 35% లాభాల వాటా ఇవ్వాలని, గెలిచిన సంఘాలకు రెండు సంవత్సరాల గుర్తింపు పత్రం ఇవ్వాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియుగా డిమాండ్ చేస్తున్నామన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App