Singareni worker dies in mine
కాంట్రాక్ట్ కార్మికుల మరణాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సింగరేణి యాజమాన్యం
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని సింగరేణి హాస్పిటల్ లో వకీల్ పల్లి గనిలో వెల్డర్ గా పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన జనగామ శర్మ అనే కాంట్రాక్టు కార్మికుడి మృతదేహాన్ని సందర్శించిన అనంతరం PSCWU IFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల రమేష్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికుల మరణాల పట్ల సింగరేణి యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది. రక్షణ చర్యల లోపం మూలంగా జనగామ శర్మ అనే వెల్డర్ కార్మికుడు మరణించినప్పటికీ సింగరేణి యాజమాన్యం సకాలంలో స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది.
7ఎల్ఈపీ గనిలో మాస్టర్ల బేస్ లో టెండర్ పొంది వకీల్ పల్లి గనిలో వెల్డర్ పనులు నిర్వహించడం టెండర్ నిబంధనలకు విరుద్ధం. అది కూడా కేవలం ఫస్ట్ షిఫ్ట్ పనులకు మాత్రమే అనుమతులు పొంది రాత్రి 9 గంటల దాకా పనిచేయడంతో ప్రమాదానికి గురికావడం జరిగింది. దానిని గుండెపోటుగా చిత్రీకరించే విధంగా సింగరేణి యాజమాన్యం వివరిస్తున్నది.
జరిగిన ప్రమాదం పై వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఉపముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు చనిపోతే ఒప్పందం చేశామని బాహాటంగా చేసిన ప్రకటనను జనగామశర్మ కార్మికుడి కుటుంబానికి వర్తింపజేయాలని కోరుతున్నాం.
పర్మనెంట్ కార్మికుడు చనిపోతే ఒక రకంగా, కాంట్రాక్ట్ కార్మికుడు చనిపోతే ఒక రకంగా వ్యవహరించే పద్ధతి సింగరేణి యాజమాన్యం విడనాడాలని డిమాండ్ చేస్తున్నాం. జనగామ శర్మ కార్మికుడి కుటుంబానికి పర్మినెంట్ ఉద్యోగంతో పాటు, పర్మినెంట్ కార్మికునికి ఇచ్చే సౌకర్యాలు అన్నీ కూడా వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నాం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App