TRINETHRAM NEWS

Singareni to declare actual profits and pay 35% to workers -CITU

ఎరవల్లి ముత్యంరావు
సిఐటియు రాష్ట్ర కార్యదర్శి

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

జీడికే-1 ఇంక్లైన్ లో ఉదయం ఏడు గంటలకు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 20 నుండి 28 వరకు చేపట్టిన దశలవారి ఆందోళన పోరాటాల్లో భాగంగా, 13 డిమాండ్లతో కూడిన గోడపోస్టరు ఆవిష్కరించి సంతకాల సేకరణ ప్రారంభించిన సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు, ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి 8 నెలలు గడిచిపోయిన కార్మికుల ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదని, అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంటు ఎన్నికలు అయిపోయినాయి కూడా ఇంతవరకు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం యజమాన్యంతో గుర్తింపు పొందిన కార్మిక సంఘాలు చర్చించడం లేదని 2023/24 వాస్తవ లాభాలు ప్రకటింపజేసి జులై నెలలో ఇప్పిస్తామని చెప్పిన గుర్తింపు సంఘం ఇప్పటివరకు కూడా లాభాల వాటపై మాట్లాడలేదని ఇదే కాకుండా ఎన్నికల ముందు అన్ని కార్మిక సంఘాల వాగ్దానం మేరకు కార్మికుల సొంతింటి పథకం అమలు, అలవెన్స్లపై ఇన్కమ్ టాక్స్ వాపస్ చేయడం, తదితర అనేక దీర్ఘకాలిక సమస్యలు పెండింగ్లో ఉన్నందున సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు పోరాటా శంఖారావం పూరించిందని తెలియజేశారు,

కార్మికుల సమస్యలపై ప్రశ్నిస్తే గుర్తింపు పత్రం లేదని కుంటి సాకులు చెప్తూ అధికార కార్యక్రమాలలో పాల్గొంటూ పబ్బం గడుపుతుందని ఎన్నికలు రెండు సంవత్సరాలకు ఒక్కసారి నిర్వహించాలని నిర్ణయం జరిగిందని ఆ నిర్ణయాన్ని ఎర్రజెండా సంఘం అని చెప్పుకుంటున్న గుర్తింపు సంఘం కట్టుబడి ఉండకుండా మాకు నాలుగు సంవత్సరాల గుర్తింపు పత్రం ఇవ్వాలని కార్మిక సమస్యలను పక్కనపెట్టి గుర్తింపు పత్రం కోసం రాష్ట్ర ప్రభుత్వం యజమాన్యం దగ్గర వెంపర్లాడుతుందని విమర్శించారు, ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం రెండు సంవత్సరాల కాల వ్యవధితో ఎన్నికలు జరిగిన తేదీ నుండి గుర్తింపు పత్రం ఇవ్వాలని లేదంటే ఎన్నికల రద్దుచేసి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని అప్పటివరకు పెండింగ్లో ఉన్న సమస్యలు అన్ని కార్మిక సంఘాలతో చర్చించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు, లేదంటే అన్ని కార్మిక సంఘాల కార్మికులను ఐక్యపరిచి రాష్ట్రవ్యాప్త పోరాటం నిర్మిస్తామని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో బ్రాంచి అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి, మండే శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు తోట నరహరి రావు, గని పిట్ కార్యదర్శి దాసరి సురేష్, అసిస్టెంట్ పిట్ కార్యదర్శి ఈ సాగర్, పెద్దపల్లి శశికిరణ్ శ్రావణ్ కుమార్, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Singareni to declare actual profits and pay 35% to workers -CITU