TRINETHRAM NEWS

Singareni management should be fully responsible for the death of Nagaraju

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఐఎఫ్ టు యు రాష్ట్ర నాయకులు తోకల రమేష్ డిమాండ్

జీడీకే 11, ఇంక్లైన్ లో జనరల్ మజ్దూర్ యువ కార్మికుడు రాసపెల్లి
నాగరాజు సెకండ్ షిఫ్ట్ విధులు నిర్వహించుకుని ఇంటికి వెళ్తున్న అర్ధరాత్రి సమయంలో జీడీకే 1&3, 11, ఇంక్లైన్ మంథని రోడ్డు మార్గంలో, మూలమలుపులతో రోడ్డు లైటింగ్ లేక ఆగి ఉన్న లారీని ఢీకొని మరణించడం జరిగింది జరిగిన ఘటనకు సింగరేణి యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాం.

సంక్షేమం కోసం అనేక చర్యలు చేపడుతున్నామన్న సింగరేణి యాజమాన్యం క్షేత్రస్థాయిలో మాత్రం పూర్తిగా వైఫల్యం చెందుతున్నది, కార్మికుల డ్యూటీలు వెళ్లడానికి వీలుగా కనీసం రోడ్ సదుపాయాలు కూడా వేయలేని దుస్థితిలో సింగరేణి యాజమాన్యం ఉన్నది. సింగరేణి నిధులను రాష్ట్రవ్యాప్తంగా పప్పు బెల్లంలా పంచి పెడుతున్న సింగరేణి యాజమాన్యం సింగరేణి గని కార్మికులకు మాత్రం సంక్షేమ సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది.

జరిగిన ఘటన పూర్తిగా సింగరేణి యాజమాన్యం చేసిన నిర్లక్ష్యం మూలంగానే దీనికి బాధ్యత వహించవలసింది సింగరేణి యాజమాన్యమే అని స్పష్టం చేస్తున్నాం.మరణించిన కార్మికుని
కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేస్తూ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాం.

ఇంతటి నిర్లక్ష్యానికి కారణమైన సింగరేణి యజమాన్యమే పూర్తిగా బాధ్యత వహించి గని ప్రమాదంగా గుర్తించి అతనికి రావలసిన బెనిఫిట్స్ అన్ని కూడా సకాలంలో అందజేయాలని తక్షణమే పాత రోడ్డును ప్రారంభించాలని డిమాండ్ డిమాండ్ చేస్తున్నాం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Singareni management should be fully responsible for the death of Nagaraju