Trinethram News : హైదరాబాద్:ఫిబ్రవరి 21
సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న 317 డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు, 168 ఇంటర్నల్ పోస్టులకు గురువారం నోటిఫికేషన్లు జారీ చేస్తున్నట్లు ఆ సంస్థ సీఅండ్ఎండీ ఎన్.బలరామ్ వెల్లడించారు.
బుధవారం సచివాలయం లో డిప్యూటీ సీఎం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణిలో కారుణ్య నియామక ప్రక్రియను వేగంగా చేపట్టాలని, ఈ ఏడాదిలో కనీసం వెయ్యి మంది వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు.
ఉద్యోగాల నియామక ప్రక్రియ చాలా పారదర్శ కంగా ఉండాలన్నారు. పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరిగినా ఉపేక్షించేది లేదన్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సింగరేణిలో ఖాళీగా ఉన్న 317 డైరెక్ట్, 168 ఇంటర్నల్ పోస్టులకు గురువారం నోటిఫికేషన్లు విడుదల చేస్తామన్నారు..