TS High Court : డిసెంబరు 27న యథావిధిగా సింగరేణి ఎన్నికలు
హైదరాబాద్: సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు ఈ నెల 27న యథావిధిగా జరగనున్నాయి. డిసెంబరు 27లోగా ఎన్నికలను నిర్వహించాలని ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం అక్టోబర్లో ఉత్తర్వులు ఇచ్చింది..
అయితే, మరోసారి ఎన్నికలు వాయిదా వేయాలని హైకోర్టులో సింగరేణి కంపెనీ మధ్యంతర పిటిషన్ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఎన్నికలు వాయిదా వేయాలనే అభ్యర్థనను తోసిపుచ్చింది. దీంతో ముందుగా ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ నెల 27న ఎన్నికలు యథావిధిగా జరగనున్నాయి..