TRINETHRAM NEWS

తుమ్మల రాజారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు సింగరేణి పౌల్ట్రీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో జీడీకే -2&2A, ఒసిపి-5, ఏరియా హాస్పిటల్ ఉద్యోగస్తులను కలిసిన రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,స్ట్రక్షరాల సమావేశంలో యజమాన్యం గుర్తింపు సంఘానికి జరిగిన చర్చలలో యజమాన్యం చెప్పిన వాదనలో ఏమాత్రం సమంజసంఘలేదని వాటిని అడ్డంగా పెట్టి కార్మికులసమస్యల పరిష్కారానికి కమిటీల పేరుతో కాలయాపన చేయటం సరైన పద్ధతి కాదని సింగరేణి కాలరేస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తున్నది పెప్స్ మీద ఇన్కమ్ టాక్స్ సాలీనా 91 కోట్లు సింగరేణి యాజమాన్యం పై భారం పడుతుందని చెప్పిన యజమాన్యం దాదాపు 35 వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల వసూళ్లు లో సంస్థ కేవలం వడ్డీ రూపంలో నష్టపోతున్న దానితో పోలిస్తే ఏమాత్రం సమంజసం గా లేదని స్పష్టం చేశారు అలాగే ఒక్క పైసా ఆర్థిక భారం పడని మారుపేర్ల విషయం విజిలెన్స్ పేరుతో పెండింగ్ పడ్డ అంశాలు పరిష్కారానికి గత ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ గాని అలాగే ఐదు జాతీయ కార్మిక సంఘాలతో పాటు గత గుర్తింపు సంఘం చేసుకున్న ఒప్పందం గాని యజమాన్యం ఇప్పటివరకు అమలు చేయకుండా మరల అదే సమస్యపై గుర్తింపు సంఘంతో కమిటీ వేయడం ఆంతర్యం ఆలస్యం చేయటం కాదా అని పేర్కొన్నారు.

సొంత ఇంటి పథకం పై సిఐటియు సుదీర్ఘకాలంగా పోరాటం చేయడం ఫలితంగా మరియు కోల్ ఇండియాలో కూడా సొంత ఇంటి పథకం పై ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత సింగరేణిలో ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని త్వరితగతిన పరిష్కారం చేయటానికి పూనుకోవాలని పేర్కొన్నారు. మిగతా అంశాలు కూడా స్పష్టంగా పేర్కొనక పోవటం పై సిఐటియు అసంతృప్తిని వ్యక్తం చేసింది. పై విషయాల పట్ల గెలిచిన సంఘం సరైన వైఖరితో స్పష్టత లేకపోవడం వల్ల కార్మికులకు అన్యాయం జరిగిందని కాబట్టి ఇకనైనా కమిటీలతో కాలయాపన చేయకుండా వెంటనే కార్మికుల సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి మెండె శ్రీనివాస్, తోట నరహరి రావు, ఆసరి మహేష్, సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి, పి శ్రీనివాసరావు, దాసరి సురేష్, ఏ శంకర్, పి సమ్మయ్య, వి రామన్న, టీ శ్రీనివాస్, జనార్దన్ రెడ్డి, బొంకూరి సురేష్, సంపత్, రాజు, బి చంద్రయ్య, పులి ఈశ్వర్, తదితర కార్మికులు పాల్గొన్నారు,

అభినందనలతో

మెండె శ్రీనివాస్, Rg1 కార్యదర్శి
సింగరేణి కాలరీ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

government blame labor problems